iDreamPost
android-app
ios-app

Devara: ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. తారక్ పై ఇంత ప్రేమా? అమ్మో ఏంటి దేవర ఈ రచ్చ?

  • Published Sep 23, 2024 | 8:37 AM Updated Updated Sep 23, 2024 | 8:37 AM

Devara Pre Release Event Cancelled, Jr NTR: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో అమ్మో..ఏంటి దేవర ఈ రచ్చ? అంటూ ఇండస్ట్రీతో పాటుగా దేశం మెుత్తం దేవర దెబ్బకు షేక్ అవుతోంది.

Devara Pre Release Event Cancelled, Jr NTR: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో అమ్మో..ఏంటి దేవర ఈ రచ్చ? అంటూ ఇండస్ట్రీతో పాటుగా దేశం మెుత్తం దేవర దెబ్బకు షేక్ అవుతోంది.

  • Published Sep 23, 2024 | 8:37 AMUpdated Sep 23, 2024 | 8:37 AM
Devara: ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. తారక్ పై ఇంత ప్రేమా? అమ్మో ఏంటి దేవర ఈ రచ్చ?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘దేవర’ మ్యానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా దేవర లేదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించే మాటలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వేయి కాదు.. లక్ష కళ్లతో ఎదురుచూస్తున్నారు. తారక్ మాస్ అవతారాన్ని, ఊచకోతను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆత్రుతగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఆయుధపూజకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ చెబుతున్నారు. ఇక సెప్టెంబర్ 22న జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో అమ్మో..ఏంటి దేవర ఈ రచ్చ? అంటూ ఇండస్ట్రీతో పాటుగా దేశం మెుత్తం దేవర దెబ్బకు షేక్ అవుతోంది. తారక్ పై ఇంత ప్రేమా అంటూ షాక్ అవుతున్నారు.

ఓ హీరోపై ఇంత ప్రేమా? ఇంత అభిమానమా? అంటూ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన తర్వాత సోషల్ మీడియా మెుత్తం ఈ విషయం గురించే చర్చ జరుగుతోంది. నోవాటెల్ లాంటి క్లోజ్ డ్ ఆడిటోరియంలో ఈవెంట్ జరుగుతుందని తెలిసినా.. దానికి తగ్గట్లుగానే పాస్ లు ఇచ్చినా.. దాదాపు 30 వేల మంది ఫ్యాన్స్ రావడం ఏంటి? ఇంటిలిజెన్స్ వర్గాలు సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదమే తప్పింది. తారక్ కోసం అభిమానులు ఇలా పోటెత్తడం చూసి.. ఈ రచ్చ ఏంటి సామీ అంటూ దేశం మెుత్తం సంభ్రమాశ్చర్యాలకు గురౌతోంది. యంగ్ టైగర్ కు ఉన్న మాస్ క్రేజ్ కు మైండ్ బ్లాక్ అవుతోంది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ రేంజ్ లో ఫ్యాన్స్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ ఆకాశమంత ప్రేమను చూపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయం గతంలో చాలాసార్లు రుజువుకూడా అయ్యింది. ‘ఆంధ్రావాలా’ ఆడియో ఫంక్షన్ ను ఓపెన్ ఏరియాలోనే నిర్వహించడానికి తలపెట్టినప్పుడు అభిమానులు లక్షల్లో తరలి వచ్చిన సంఘటన ఇప్పటికీ ఓ రికార్డే. ఆ ఈవెంట్ కు మూడు ట్రైన్లు కూడా బుక్ చేయడం టాలీవుడ్ చరిత్రలో మర్చిపోలేని సంఘటన. అప్పటి నుంచి తారక్ పై అభిమానుల్లో ప్రేమ పెరుగుతూ వస్తుందే తప్ప ఇసుమంతైైనా తగ్గడం లేదు. ఇక ఫ్యాన్స్ కోసం యంగ్ టైగర్ సైతం ఎలాంటి సాహసం అయినా చేయడానికి వెనకాడడు.

కాగా.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా అభిమానులు ఇంతే ప్రేమను కురిపించారు. కానీ.. నిర్వాహకులు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు ఇరు రాష్ట్రాల నుంచి తరలిరావడంతో.. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నోవాటెల్ లోకి ఫ్యాన్స్ దూసుకెళ్లడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి, దాంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ.. తమ అభిమాన హీరోన చూసేందుకు ఫ్యాన్స్ ఏ మాత్రం వెనకడు వేయలేదు. ఈ క్రమంలో పరిస్థితులు చేయి దాటిపోతాయని గ్రహించిన మేకర్స్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఎన్టీఆర్ మాస్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఇండియా మెుత్తం షేక్ అవుతోంది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంత రచ్చ జరగడం, వేడుక రద్దు కావడంతో దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఇప్పుడు దేవర హాట్ టాపిక్ గా మారింది. అమ్మో దేవర ఏంటి ఈ రచ్చ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ రద్దు కావడంపై తారక్ సైతం స్పందించాడు. మీకంటే నాకే ఎక్కువ బాధ ఉందని చెప్పుకొచ్చాడు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio