iDreamPost
android-app
ios-app

Jr. NTR: గేమ్ ఛేంజర్ తో యంగ్ టైగర్ రికార్డ్ ను చరణ్ కొడతాడా?

  • Published Sep 10, 2024 | 4:05 PM Updated Updated Sep 10, 2024 | 4:05 PM

Jr. NTR, Ram Charan: దేవర మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెట్ చేసిన ఓ రికార్డును గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ బద్దలు కొడతాడా? అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

Jr. NTR, Ram Charan: దేవర మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెట్ చేసిన ఓ రికార్డును గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ బద్దలు కొడతాడా? అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 10, 2024 | 4:05 PMUpdated Sep 10, 2024 | 4:05 PM
Jr. NTR: గేమ్ ఛేంజర్ తో యంగ్ టైగర్ రికార్డ్ ను చరణ్ కొడతాడా?

దేవర మూవీతో రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నారు. ముంబైలో ఈ వేడుక జరగబోతోంది. ఇక దేవర ట్రైలర్ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా.. విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు యంగ్ టైగర్. తాజాగా యూఎస్ మార్కెట్ లో రిలీజ్ కు ముందే.. 1 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవ్వరూ సాధించలేదు. అయితే ఈ రికార్డును చరణ్ గేమ్ ఛేంజర్ తో బద్దలు కొడతాడా?

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’.. విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది. చుట్టమల్లే సాంగ్, దావూదీ సాంగ్స్ ఏం రేంజ్ లో హిట్ అయ్యాయో మనందరికి తెలిసిందే. మిలియన్ల కొద్ది వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి ఈ సాంగ్స్. మరోవైపు యూఎస్ మార్కెట్ ను దేవర బ్లాస్ట్ చేస్తోంది. ప్రీ సేల్స్ లో ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ మూవీ టచ్ చేయని రికార్డును తన పేరిట లిఖించుకుంది. విడుదలకు ముందే 1 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకున్న తొలి చిత్రంగా దేవర నిలిచింది. ఈ లెక్కలు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. తారక్ సెట్ చేసిన 1 మిలియన్ డాలర్ల రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేసే టార్గెట్ చరణ్ ముందుంది. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ను సంపాదించారు ఇద్దరు హీరోలు. అదే క్రేజ్ తో యూఎస్ మార్కెట్ లో దూసుకెళ్తున్నాడు తారక్. అయితే ఇప్పుడు తారక్ సెట్ చేసిన టార్గెట్ ను చరణ్ బద్దలు కొడతాడా? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ 1 మిలియన్ డాలర్ల రికార్డ్ ను చరణ్ బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు సినీ పండితులు. ఎందుకంటే? ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా చరణ్ క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆ క్రేజ్ తోనే శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ తారక్ ఇచ్చిన టార్గెట్ ను కొట్టేస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నాడు. పైగా చరణ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పోలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతోంది. త్వరలోనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డ్ ను చరణ్ గేమ్ ఛేంజర్ తో బ్రేక్ చేస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet