iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్ పై లావణ్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు.. తాళి కొట్టేశాడంటూ

  • Published Sep 10, 2024 | 3:46 PM Updated Updated Sep 10, 2024 | 3:46 PM

రాజ్ తరుణ్ పై ఆయన మాజీ ప్రేయసి లావణ్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు.. ఈసారి ఏకంగా దొంగతనం ఆరోపణలు చేసింది. తాను జైల్లో ఉండగా... తన ఇంట్లో చోరీకి పాల్పడ్డాడని తెలిపింది.

రాజ్ తరుణ్ పై ఆయన మాజీ ప్రేయసి లావణ్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు.. ఈసారి ఏకంగా దొంగతనం ఆరోపణలు చేసింది. తాను జైల్లో ఉండగా... తన ఇంట్లో చోరీకి పాల్పడ్డాడని తెలిపింది.

  • Published Sep 10, 2024 | 3:46 PMUpdated Sep 10, 2024 | 3:46 PM
రాజ్ తరుణ్ పై లావణ్య మరోసారి  పోలీసులకు ఫిర్యాదు..  తాళి కొట్టేశాడంటూ

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‍లో హాట్ టాపిక్‌గా మారింది రాజ్ తరుణ్- లావణ్య వివాదం. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, మరో నటితో ఎఫైర్ నడుపున్నాడంటూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. కాగా, ఈ కేసులో రోజుకొక ట్విస్టులు, టర్నింగ్స్ చోటుచేసుకుంటున్నాయి. రాజ్ తరుణ్ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకున్నాడని, అబార్షన్ కూడా చేయించాడని, అలాగే నటి మాల్వి మల్హోత్రాతో ప్రేమ వ్యవహారం నడుపుతూ.. తనను దూరం పెట్టాడని వాపోయింది. అలాగే పోలీసులకు సాక్షాధారాలను సమర్పించింది. తాజాగా, ఈ కేసులో మరో ట్విస్టు నెలకొంది. రాజ్ తరుణ్ తన ఇంట్లో దొంగతనం చేశాడని సంచలన కామెంట్స్ చేసిన ఆమె.. తాజాగా అతడిపై దొంగతనం కేసు పెట్టింది.

తన బంగారం, తాళిబొట్టు, పుస్తెల తాడును రాజ్ తరుణ్ దొంగిలించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేసింది. సుమారు 12 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని తెలిపింది. గోల్ట్ కొనుగోలు చేసిన బిల్లులతో సహా పలు ఆధారాలను పోలీసులకు సమర్పించింది రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాపై అనుమానం వ్యక్తం చేసింది. తాను జైలుకు వెళ్లేముందు ఇంటికి తాళం వేశానని, నగలు బీరువాలో ఉంచానని, ఆ తాళాలు రాజ్ దగ్గర ఉన్నాయని, పలు ఆభరణాలు, డాక్యుమెంట్లు తీసుకొని రాజ్ తరుణ్ ముంబై వెళ్లాడని, తన దగ్గర నుండి తాళాలు తీసుకుని చూస్తే.. బంగారం చోరీకి గురైందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

అయితే రాజ్ తరుణ్ వాదన మరోలా ఉంది. ఒకప్పుడు లావణ్యతో ఉన్న మాట నిజమేనని, ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, మరొకరితో ఎఫైర్ నడుపుతుందని తెలియడంతో దూరం పెట్టినట్లు చెప్పాడు. ఇదంతా డబ్బుకోసం ఆమె ఆడుతున్న నాటకం అంటూ తాను కోర్టులో తేల్చుకుంటానని చెబుతున్నాడు. ఈ వివాదం వేడి వేడిగా ఉన్న సమయంలోనే రాజ్ తరుణ్ తన రెండు సినిమాలను రిలీజ్ చేసేశాడు. కాగా, ఈ కేసులో రాజ్ తరుణ్ నిందితుడు అంటూ పోలీసులు స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్‌- లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు. ఇద్దరు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. తాజా కేసుపై ఈ యంగ్ హీరో స్పందించాల్సి ఉంది.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş