iDreamPost
android-app
ios-app

తారక్ వాచ్ ధర అన్ని కోట్లా? అమ్మితే లైఫ్ సెట్ అయిపోయినట్లే..!

  • Published Apr 10, 2024 | 5:22 PM Updated Updated Apr 10, 2024 | 6:11 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ఎదో అందరికి తెలిసే ఉంటుంది. అదే సెలెబ్రిటీల గ్యాడ్జెట్స్, అవుట్ ఫిట్స్ కాస్ట్స్ డీటెయిల్స్. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లోకి.. తారక్ వాచ్ కూడా యాడ్ అయింది. మరి ఈ వాచ్ ధర ఎంతో చూసేద్దాం.

ఈ మధ్య సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ఎదో అందరికి తెలిసే ఉంటుంది. అదే సెలెబ్రిటీల గ్యాడ్జెట్స్, అవుట్ ఫిట్స్ కాస్ట్స్ డీటెయిల్స్. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లోకి.. తారక్ వాచ్ కూడా యాడ్ అయింది. మరి ఈ వాచ్ ధర ఎంతో చూసేద్దాం.

  • Published Apr 10, 2024 | 5:22 PMUpdated Apr 10, 2024 | 6:11 PM
తారక్ వాచ్ ధర అన్ని కోట్లా? అమ్మితే లైఫ్ సెట్ అయిపోయినట్లే..!

సోషల్ మీడియా కొత్త ట్రెండ్స్ కు అడ్డాగా మారిపోయింది. ముఖ్యంగా వారి వారి అభిమాన నటీ నటుల గురించి అభిమానులు చేస్తున్న హడావిడి అంత ఇంత కాదు. వారి అభిమాన నటి నటుల చిన్న నాటి ఫొటోస్ నుంచి లేటెస్ట్ గా వేసుకున్న అవుట్ ఫిట్స్, ధరించిన గ్యాడ్జెట్స్ , వారి పెర్సనల్ మ్యాటర్స్ ఒకటి రెండు కాదు ప్రతి చిన్న విషయాన్నీ కూడా వైరల్ చేయడంలో ముందుండేది అభిమానులే. చెప్పాలంటే అసలు ఈ ట్రెండ్స్ క్రియేట్ చేసిందే అభిమానులు. దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న ట్రెండ్ ఏంటంటే స్టార్ సెలెబ్రిటీల అవుట్ ఫిట్స్ , గ్యాడ్జెట్స్ ఒరిజినల్ ధరలు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎంతో సెలెబ్రిటీల అవుట్ ఫిట్స్ గ్యాడ్జెట్స్ ధరలు తెలుసుకుని నెటిజన్లు నోర్లు వెళ్ళబెట్టారు. రీసెంట్ గా అయితే చిరు ధరించిన వాచ్ ధర దగ్గర ఆగిన ఈ ట్రెండ్.. ఇప్పుడు తారక్ ధరించిన వాచ్ వరకు వచ్చింది. నా ప్రైస్ ఎంతో గెస్ చేసేయండి అంటూ.. ధగ ధగ మెరుస్తున్న తారక్ వాచ్ ఈ లిస్ట్ లో యాడ్ అయింది. దీని ధర ఎంతో చూసేద్దాం.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారన్న విషయాన్నీ ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించారు. సినిమా రిలీజ్ ఇంకా కొద్దీ రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో మూవీ టీం అంత సినిమా షూటింగ్ పనులను వేగవంతం చేసింది. ఇక తాజాగా తారక్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు గెస్ట్ గా వచ్చి.. దేవర సినిమాపై ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పారు. ఇలా చెప్పడం ఓవర్ అవుతుందని అనుకోవద్దు. దేవర సినిమా మీరంతా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది. కాస్త లేట్ అయినా సినిమా అందరికీ నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ ఈవెంట్ లో తారక్ ధరించిన వాచ్ కాస్ట్. ఈ వాచ్ ధర తెలుసుకున్న వారంతా వాడే ఒకే ఒక్క డైలాగ్ “ఆ వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోద్ది” . మరి ఆ వాచ్ ఎంతో ఏ బ్రాండ్ కు చెందిందో చూసేద్దాం.

సెలెబ్రిటీల ధరిస్తున్న వాచెస్ అన్ని కూడా ఏకంగా కోట్లు పలుకుతున్నాయి. తారక్ ధరించిన ఈ వాచ్ ‘ఒడొమార్ పిగే రాయల్ ఓక్’ బ్రాండ్ కు చెందింది. దీని ధర 189,000 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.1,57,32,455 లక్షలు. ఇందులో అనేక రకాల మోడల్స్ కూడా ఉంటాయి. ఆ మోడల్స్ ను బట్టి ధరల్లో మార్పులు వస్తుంటాయి. ఇక చూడడానికి సింపుల్ గా ఉన్న వాచ్ ఏ ఈ రేంజ్ లో ఉందంటే.. ఇందులో ఉండే మోడల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించవచ్చు . స్పోర్ట్స్ వాచ్, కస్టమైజ్‌డ్ వాచ్‌ ఇలా చాలా రకాల వాచెస్ కలెక్షన్ తారక్ దగ్గర ఉన్నాయి. ఎనిమిది కోట్లు ఖరీదు చేసే ఒక వాచ్ కూడా తారక్ దగ్గర ఉందట. ఇక దీనిని చూసి నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş