iDreamPost
android-app
ios-app

Jr NTR Turns 39 సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న‌ ‘HBDManOfMassesNTR’

  • Published May 20, 2022 | 12:12 PM Updated Updated May 20, 2022 | 12:13 PM
Jr NTR Turns 39 సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న‌ ‘HBDManOfMassesNTR’

సోషల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఎన్టీఆర్ పేరే. బర్త్ డే విషెష్ వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానులు, సినీ, ఇతర రంగాలకు చెందిన వాళ్లు విషెష్ చెబుతున్నారు. సెల‌బ్రిటీలు పోస్టులు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ తో దేశం మొత్తానికి తెలిసిన జూ.ఎన్టీయార్, #HBDManOfMassesNTR హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో టాప్ లో ఉన్నారు.

జూ.ఎన్టీయార్ కి మ‌హేష్ బాబు విషెష్ చెప్పారు. ఈ ట్వీట్ ను ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తున్నారు.

హ్యాపీ బర్త్ డే తారక్ అని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ట్వీట్ చేశారు. RRR సినిమాలో కలిసి నటించడం, మాట్లాడటం ఏంతో ఆనందంగా ఉందన్నారు.


యంగ్ టైగర్ ఇప్పుడు పాన్ ఇండియా టైగర్, అద్భుతమైన ఎదుగుదలకు నేనే ప్రత్యక్ష సాక్షినీ…RRR మూవీలో మీ నటన అధ్బుతం. ముఖ్యంగా కొమరం భీమోడో పాటలో మీ నటనకు కన్నీళ్లు వచ్చాయి అంటూ దర్శకుడు శ్రీను వైట్ల విషెష్ చెప్పాడు.

చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ.


నువ్వు నాకు ఏమీ అవుతావో..చెప్పడానికి పదాలు రావడం లేదు. మన మధ్య ఉన్న అనుబంధం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. హ్యాపీ బర్త్ డే అంటూ హీరో రామ్ చరణ్ తేజ ట్వీట్ చేశారు.


బాలీవుడ్, టాలీవుడ్, ఇతర వుడ్ లకు సంబంధించిన వాళ్లు NTR కు విషెష్ తెలుపుతున్నారు. మొత్తానికి NTR పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.