iDreamPost
android-app
ios-app

వార్ 2లో జాయిన్ అయిన తారక్.. న్యూ లుక్స్ చూశారా?

  • Published Apr 11, 2024 | 5:48 PM Updated Updated Apr 11, 2024 | 5:48 PM

ఆర్ఆర్ఆర్ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. యంగ్ టైగర్ ను తెరపై చూసేందుకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను కూడా మడతపెట్టేసేందుకు సిద్ధం అయ్యాడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్.

ఆర్ఆర్ఆర్ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. యంగ్ టైగర్ ను తెరపై చూసేందుకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను కూడా మడతపెట్టేసేందుకు సిద్ధం అయ్యాడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్.

  • Published Apr 11, 2024 | 5:48 PMUpdated Apr 11, 2024 | 5:48 PM
వార్ 2లో జాయిన్ అయిన తారక్.. న్యూ లుక్స్ చూశారా?

దేవర సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. మరో సినిమా సెట్స్‌లోకి అడుగుపెడుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సారి బాలీవుడ్ బాక్సాఫీసుకు గురి పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీతో అతడికి బీటౌన్‌లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి విదితమే. ఇప్పుడు అక్కడి మార్కెట్‌ను శాసించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. బాలీవుడ్ హ్యాండ్సమ్ అండ్ హల్క్ హృతిక్ రోషన్‌తో‌ వార్ 2లో తలపడేందుకు ముంబయి చేరుకున్నాడు. అతడికి అక్కడ వామ్ వెల్కమ్ లభించింది. వార్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోన్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తారక్ పై సన్నివేశాలు మినహా.. మిగిలినవీ తెరకెక్కించారని తెలుస్తోంది.

దేవర షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇప్పుడు వార్ 2లో పాల్గొంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 10 రోజుల పాటు అక్కడే ఉండనున్నాడని తెలుస్తోంది. హృతిక్, తారక్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం భారీగా డేట్స్ ఇచ్చాడట యంగ్ టైగర్. 60 రోజుల కాల్షీట్స్ వార్ 2 కోసం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇక హృతిక్, జూనియర్ ఎన్టీఆర్‌లపై 30 రోజుల పాటు సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి.. వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి విడుదల చేయాలన్న ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది ఆగస్టు 14న సినిమా విడుదల చేయాలన్న ప్రణాళికలో ఉంది చిత్ర యూనిట్. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ మూవీని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

యే జవానీ హై దివానీ, బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి డైరెక్టర్. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటిస్తున్నారని వినికిడి. ఇందులో తారక్‌ను చాలా పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నారట. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. ముంబయి చేరుకున్న తారక్ పిక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దేవర షూటింగ్ దశలో ఉండగానే ఇప్పుడు వార్ 2ను షురూ చేశాడు. ఇక కొరటాల దర్శకత్వంతో రూపు దిద్దుకుంటున్న దేవర అక్టోబర్ 10న విడుదల కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కున్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో మూవీకి కూడా ఓకే చెప్పాడు తారక్. వెండితెరపై అభిమానులకు కనిపించకుండా రెండేళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన నందమూరి వారసుడు.. ఇక వరుస పెట్టి ప్రతి ఏడాది కనిపించి.. అభిమానుల్ని కనువిందు చేయనున్నాడన్న మాట.

Jojobet GirişJojobetcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom