iDreamPost
android-app
ios-app

ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ – మోక్షజ్ఞ! ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!

  • Author ajaykrishna Published - 02:27 PM, Thu - 24 August 23
  • Author ajaykrishna Published - 02:27 PM, Thu - 24 August 23
ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ – మోక్షజ్ఞ! ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!

నందమూరి ఫ్యాన్స్ అంతా కన్నుల పండుగ చేసుకునే విషయం ఒకటి జరిగింది. ఎంతో కాలంగా ఇలాంటి మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు ఓ పెళ్లి వేడుక సందర్బంగా ఫ్యాన్స్ కోరిక తీరిపోయింది. ఇటీవల నందమూరి కుటుంబ సభ్యులు అందరూ ఒకే చోట కలిశారు. నందమూరి సుహాసిని కుమారుడు హర్ష పెళ్లి వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. అయితే.. ఈ వేడుకకు బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్.. ఇలా అందరూ ఫ్యామిలీస్ తో హాజరయ్యారట. వీరికి సంబంధించి ఫోటోలు.. వీడియోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి.

ఇదివరకు ఇదే పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ.. ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో మెరిసిన ఫోటోలు చూశాం. ఆ ఫోటోలు చూసి ఫ్యాన్స్ అందరూ చాలా సంబరపడిపోయారు. కానీ.. ఇప్పుడు అంతకంటే ఆనందాన్ని ఇచ్చే ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అన్నదమ్ములు జూనియర్ ఎన్టీఆర్ – మోక్షజ్ఞ.. ఒకరినొకరు ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్నారు. ఆ ఫోటో ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ అందరి హృదయాలను హ్యాపీనెస్ తో నింపేసింది. ఎన్టీఆర్ కి బాబాయ్ బాలయ్య అంటే ఎంత అభిమానమో తెలిసిందే. అలాగే బాలయ్య ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ ని ఎంతో అభిమానిస్తుంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో చూస్తే.. ఇద్దరు అన్నదమ్ములు ఎంత ఆనందంగా ఒకరినొకరు పలకరించుకున్నారో అర్ధమవుతుంది. ఈ ఒక్క ఫోటోతో నందమూరి ఫ్యాన్స్ లో హ్యాపీనెస్ రెట్టింపు అయ్యిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ప్రెజెంట్ కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయాడు. కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఆ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఇక మోక్షజ్ఞ విషయానికి వస్తే.. ప్రస్తుతం డెబ్యూ మూవీ గురించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ రానుందేమో చూడాలి. మరి ఎన్టీఆర్ – మోక్షజ్ఞల లవ్లీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet