iDreamPost
android-app
ios-app

Squid Game: నా సినిమా కాపీ కొట్టి ‘స్క్విడ్ గేమ్’ తీశారు.. కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్!

  • Published Sep 15, 2024 | 5:07 PM Updated Updated Sep 15, 2024 | 5:07 PM

Soham Shah copy allegations on Squid Game, Luck Movie: నా 'లక్' మూవీని కాపీ కొట్టి స్వ్కిడ్ గేమ్ ను తెరకెక్కించారని బాలీవుడ్ డైరెక్టర్ న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టుకెక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Soham Shah copy allegations on Squid Game, Luck Movie: నా 'లక్' మూవీని కాపీ కొట్టి స్వ్కిడ్ గేమ్ ను తెరకెక్కించారని బాలీవుడ్ డైరెక్టర్ న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టుకెక్కాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Squid Game: నా సినిమా కాపీ కొట్టి ‘స్క్విడ్ గేమ్’ తీశారు.. కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్!

‘స్వ్కిడ్ గేమ్’.. ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2021లో నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ కొరియన్ డ్రామా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచలోని సగం మంది కంటే ఎక్కువ ప్రేక్షకులు ఈ సిరీస్ ను చూశారు. స్ట్రీమింగ్ కు వచ్చిన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 11 కోట్ల మంది చూశారు. దాంతో స్వ్కిడ్ గేమ్ పలు రికార్డులు కూడా బద్దలు కొట్టింది. అయితే.. ఈ వెబ్ సిరీస్ తన మూవీని చూసి, కాపీ కొట్టి తీశారని ఓ బాలీవుడ్ డైరెక్టర్ కోర్టుకెక్కాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. కానీ.. వాటిల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోతాయి. అలాంటి వాటిలో ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ ఒకటి. ఈ కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ వరల్డ్ ను షేక్ చేసింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన స్క్విడ్ గేమ్ సంచలనాలు సృష్టించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ వెబ్ సిరీస్ ను తన సినిమా ‘లక్’ ని చూసి, కాపీ కొట్టి తీశాడని ఆరోపించాడు బాలీవుడ్ డైరెక్టర్ సోహమ్ షా. ఇది కాపీ రైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్ట్ లో దావా వేశాడు. నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సిరీస్ ను తొలగించాలని కోరాడు. ఇక సోహమ్ షా ఆరోపణలపై నెట్ ఫ్లిక్స్ తాజాగా స్పందించింది.

ఆ బాలీవుడ్ డైరెక్టర్ చేసింది కేవలం ఆరోపణలు మాత్రమే అని, అందులో ఎలాంటి నిజం లేదని నెట్ ఫ్లిక్స్ చెప్పుకొచ్చింది. స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ స్టోరీని రాసింది, డైరెక్ట్ చేసింది హ్వాంగ్ డాండ్ హ్యూక్ అని ఓ ప్రకటనలో తెలిపింది. మరి నెట్ ఫ్లిక్స్ రియాక్షన్ కు బాలీవుడ్ డైరెక్టర్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి. కాగా.. 2009లో వచ్చిన లక్ మూవీ లో సంజయ్ దత్, మిథును చక్రవర్తి, ఇమ్రాన్ ఖాన్, శృతి హాసన్ నటించారు. శృతి హాసన్ ఈ మూవీతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. స్వ్కిడ్ గేమ్ సీజన్ 2 త్వరలోనే రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 26 నుంచి సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా ఫైనల్ సీజన్ ను వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాపీ రైట్ వివాదం నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ ను కాపీ కొట్టి తీశారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.