Venkateswarlu
ఉదయం బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను ఆయన తీసేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఉదయం బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను ఆయన తీసేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Venkateswarlu
సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించడానికి గురువారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ వివాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ప్లెక్సీలు పెట్టారు. అక్కడికి వచ్చిన బాలకృష్ణ వాటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్లెక్సీలను అక్కడినుంచి తీసేయించారు. దీంతో వివాదం మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు.. మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బాలకృష్ణల పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. ఆయన స్పందిస్తూ.. ‘‘ వాళ్ల నీచాతి నీచమైన బుద్ది బయటపడింది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయనకు వర్ధంతి చేస్తారా?. జూనియర్ ఎన్టీఆర్‌తో కూడిన ఫ్లెక్సీలు తొలిగిస్తే ఆయనకు నష్టమేమైనా ఉందా..? వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు కలిసినా.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు.
పెద్ద ఎన్టీఆర్‌ను చంద్రబాబు కోసం దించేశారు. అల్లుడి లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు’’ అని కొడాలి నాని మండి పడ్డారు. సోషల్ మీడియాలో సైతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఉదయం బాలకృష్ణ తీసేయించిన ఎన్టీఆర్ ప్లెక్సీలు మళ్లీ అక్కడే దర్శనమిస్తున్నాయి.
‘‘ ఎక్కడినుంచి బ్యానర్లు తీయించారో మళ్లీ అక్కడికే వచ్చాయి. మళ్లీ తీసేయించాలనుకుంటే.. తీసేయించుకోండి.. మళ్లీ అక్కడికి వస్తాయి’’ అని ఆ ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉన్నారు. కాగా, బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లిన సమయంలో జూనియర్ ఫ్యాన్స్ .. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేయటం గమనార్హం. ఇవే బాలకృష్ణ ఆగ్రహానికి కారణం అయ్యాయని నెటిజన్లు భావిస్తున్నారు. మరి, ఉదయం బాలకృష్ణ తీసేయించిన జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలు మళ్లీ అక్కడికే రావటంపై.. మొత్తం ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.