iDreamPost
android-app
ios-app

Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? ఎప్పుడంటే?

  • Published Sep 05, 2024 | 9:58 AM Updated Updated Sep 05, 2024 | 9:58 AM

Devara Trailer, Jr. NTR: దేవర మూవీ ట్రైలర్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Devara Trailer, Jr. NTR: దేవర మూవీ ట్రైలర్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Sep 05, 2024 | 9:58 AMUpdated Sep 05, 2024 | 9:58 AM
Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? ఎప్పుడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రాబోతున్న మూవీ ‘దేవర’. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో దేవర టాప్ లో ఉంది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడొస్తుందా? అని తారక్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. మరి నిజంగానే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? తెలుసుకుందాం పదండి.

‘దేవర’ ట్రైలర్ కోసం తారక్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దాంతో మేకర్స్ సైతం ట్రైలర్ ను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రిలీజ్ చేసే పనిలో పడ్డారట. అద్బుతమైన విజువల్స్ తో, భారీ యాక్షన్, డైలాగ్స్ తో సూపర్ ట్రైలర్ ను మేకర్స్ కట్ చేశారని టాక్. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ ను విడుదల చేయనున్నారని టాక్. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. గతంలో సెప్టెంబర్ 15న ట్రైలర్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా.. తాజాగా దేవర నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు. దావూదీ.. దావూదీ అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్స్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అలాగే జాన్వీ అందాలు కూడా పాటకు హైలెట్ గా నిలుస్తున్నాయి. పాట రిలీజ్ అయిన నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ రేంజ్ లో దావూదీ పాట కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. మరి దేవర ట్రైలర్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet