iDreamPost
android-app
ios-app

Devara: తారక్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ‘దేవర’ ప్రమోషన్స్ అప్పటి నుంచే!

  • Published Sep 02, 2024 | 12:14 PM Updated Updated Sep 02, 2024 | 12:14 PM

Jr NTR, Devara promotions: దేవర రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ ప్రారంభించేది అప్పుడే అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

Jr NTR, Devara promotions: దేవర రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ ప్రారంభించేది అప్పుడే అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

  • Published Sep 02, 2024 | 12:14 PMUpdated Sep 02, 2024 | 12:14 PM
Devara: తారక్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ‘దేవర’ ప్రమోషన్స్ అప్పటి నుంచే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు తారక్ రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ లతో కలిసి కర్ణాటకలోని దేవాలయాలను సందర్శిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న  క్రమంలో దేవర ప్రమోషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? అంటూ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర ప్రమోషన్స్ గురించి ఓ న్యూస్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది.

‘దేవర’ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు దేవర రాబోతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్పీడ్ గా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రమోషన్స్ లో కి దిగబోతోంది. ప్రస్తుతం తారక్ కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలను దర్శిస్తున్నాడు తారక్. అక్కడి నుంచి వచ్చిన వెంటనే.. ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. ఈ నెల రెండో వారం నుంచి ప్రమోషన్స్ ను ప్రారంభించాలని మూవీ టీమ్ ప్లానింగ్ లో ఉందట.

Koratala Siva

అయితే.. తొలుత హిందీలో కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ చేయాలని భావిస్తున్నారట. ఆ తర్వాత తమిళ్, తెలుగులో స్పెషల్ ఈవెంట్స్ తో పాటుగా ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ విషయం కాస్త బయటకి తెలియడంతో.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక దేవరలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. మూడో పాట కూడా అంతకు మించి ఉంటుందని అనిరుధ్ ఇచ్చిన హింట్ భారీ హైప్ ను క్రియేట్ చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom