iDreamPost
android-app
ios-app

Sree Vishnu: ఊహకందని రిస్క్ చేస్తున్న శ్రీవిష్ణు.. తెలిస్తే మైండ్ బ్లాకే!

  • Published Jun 04, 2024 | 11:30 AM Updated Updated Jun 04, 2024 | 11:30 AM

యంగ్ హీరో శ్రీవిష్ణు తన నెక్ట్స్ మూవీ కోసం ఊహకందని రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంతకీ శ్రీవిష్ణు చేస్తున్న ఆ రిస్క్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

యంగ్ హీరో శ్రీవిష్ణు తన నెక్ట్స్ మూవీ కోసం ఊహకందని రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంతకీ శ్రీవిష్ణు చేస్తున్న ఆ రిస్క్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

  • Published Jun 04, 2024 | 11:30 AMUpdated Jun 04, 2024 | 11:30 AM
Sree Vishnu: ఊహకందని రిస్క్ చేస్తున్న శ్రీవిష్ణు.. తెలిస్తే మైండ్ బ్లాకే!

ఇండస్ట్రీలోకి వచ్చాక నటుడిగా అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తేనే గుర్తింపు, మంచి పేరు, ప్రశంసలు లభిస్తాయి. అలా కాదని గిరి గీసుకుని ఇదే జానర్ లో, ఇవే పాత్రలు చేస్తాను అంటే కుదరదు. కొంత మంది హీరోలు హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరో శ్రీవిష్ణు ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు సోలో హీరోగా దూసుకెళ్తున్నాడు. ఇక తన నెక్ట్స్ మూవీ కోసం ఊహకందని రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

శ్రీవిష్ణు.. టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సోలో హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఓం భీమ్ బుష్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘స్వాగ్’ అనే మూవీ చేస్తున్నాడు. ‘రాజ రాజ చోర’ డైరెక్టర్ హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దాంతో ఈ కాంబినేషన్ పై మంచి హైప్ వస్తోంది. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే?

‘స్వాగ్’ చిత్రంలో శ్రీవిష్ణు ఏకంగా 14 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి ట్రాన్స్ జెండర్ పాత్ర కూడా ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పడు ఈ న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ గా మారింది. కథ డిమాండ్ చేస్తే.. ఎలాంటి పాత్రలైనా చేయడానికి వెనకాడడు శ్రీవిష్ణు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఇక స్వాగ్ చిత్రంలో హీరోయిన్ గా రీతు వర్మ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ టీజర్, హీరోయిన్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 14 విభిన్నమైన గెటప్స్.. అందులో ట్రాన్స్ జెండర్ పాత్ర కూడా చేస్తున్నాడంటే.. శ్రీవిష్ణు సాహసమనే చెప్పాలి. మరి ఊహకందని రిస్క్ చేస్తున్న శ్రీవిష్ణు సక్సెస్ అవుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet