iDreamPost
android-app
ios-app

Jr.NTRకి అదృష్టంగా మారిన సలార్ సక్సెస్! తారక్ టైమ్ బాగుంది!

ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సమయంలో తాను తీయబోయే సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా.. యశ్‌తో కేజీఎఫ్‌ 3 కమిట్‌ అయ్యారు.

ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సమయంలో తాను తీయబోయే సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా.. యశ్‌తో కేజీఎఫ్‌ 3 కమిట్‌ అయ్యారు.

Jr.NTRకి అదృష్టంగా మారిన సలార్ సక్సెస్! తారక్ టైమ్ బాగుంది!

సలార్‌ సినిమా భారీ అంచనాలను మించి వర్కవుట్‌ అయింది. దేశ వ్యాప్తంగా మూవీకి మంచి టాక్‌ వస్తోంది. రివ్యూవర్లు సైతం బొమ్మ బ్లాక్‌ బాస్టర్‌ అని ధ్రువీకించారు. మంచి రేటింగ్‌ సైతం ఇచ్చారు. ఇప్పుడు సలార్‌ దృష్టి మొత్తం కలెక్షన్ల పైనే ఉంది. ప్రత్యర్థి చిత్రాలను సైతం పక్కకు నెట్టి సలార్‌ దూసుకుపోనుంది. సలార్‌కు మొదటి రోజు 150 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 1000 కోట్ల మార్కును తక్కువ టైంలోనే చేరుకుంటుందని అంటున్నారు.

మరో సారి రుజువైన ప్రశాంత్‌ నీల్‌ సత్తా.. 

కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ 2 సినిమాలు దేశ వ్యాప్తంగా సాధించిన సంచలన విజయం.. నెలకొల్పిన రికార్డులు.. కొల్లగొట్టిన కలెక్షన్లు ఇవన్నీ గాలివాటంగా వచ్చాయని బాలీవుడ్‌లో కొందరు భావిస్తూ వచ్చారు. అదంతా తప్పని సలార్‌ నిరూపించింది. ప్రశాంత్‌ నీల్‌ సత్తా ఏంటో మరో సారి నిరూపితమైంది. ప్రశాంత్‌ మేకింగ్‌లో సత్తా ఉన్న దర్శకుడని తేలిపోయింది. తలలు పండిన చాలా మంది బాలీవుడ్‌ దర్శకులు సాధించలేని చాలా రికార్డులను ప్రశాంత్‌ ఒంటి చేత్తో.. కేవలం మూడు సినిమాలతో సాధించేశాడు.

సలార్‌ హిట్‌తో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ.. 

ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సమయంలో తన తర్వాతి సినిమాలు ఎవరితో చేస్తున్నాడో చెప్పేశాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు. యశ్‌తో కేజీఎఫ్‌ 3 చేయబోతున్నాడు. అయితే, సలార్‌ విడుదలకు ముందు వరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌లో ఓ రకమైన భయం ఉండేది. సినిమా అటూ,ఇటూ అయితే, పరిస్థితి ఏంటి అని లోలోపల మదనపడుతూ వచ్చారు. అయితే, సలార్‌ విజయం వారి భయాలను దూరం చేసింది. ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కంటే ఎక్కువగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సంతోషిస్తున్నారు. తమ హీరో ఖాతాలో కూడా ఓ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ ఖాయమని అనుకుంటూ ఉన్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు అదృష్టంగా మారిన సలార్ సక్సెస్!

కేజీఎఫ్‌, కేజీఎఫ్‌2 సినిమాల వరకు ప్రశాంత్‌ నీల్‌ సినిమాలకు దేశ వ్యాప్తంగా ఓ సాధారణ మార్కెట్‌ ఉండేది. కేజీఎఫ్‌ 2కు ఉన్న హైప్‌తో దానికి మంచి మార్కెట్‌ లభించింది. సలార్‌ విషయంలో ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌డమ్‌ కీ రోల్‌ పోషించింది. దేశ వ్యాప్తంగా మూవీకి మంచి మార్కెటింగ్‌ లభించింది. సలార్‌ సాధించిన విజయంతో లెక్కలు మొత్తం మారిపోయాయి. ప్రశాంత్‌ నీల్‌ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. మార్కెట్‌ కూడా పెరగనుంది. ఇదే జూనియర్‌ ఎన్టీఆర్‌కు వరంగా మారనుంది. ప్రశాంత్‌ నీల్‌తో జూనియర్‌ ఎన్టీఆర్‌ తీసే సినిమాకు దేశ వ్యాప్తంగా ముందెన్నడూ లేనంతగా మార్కెట్‌ వచ్చే అవకాశం ఉంది. మరి, సలార్‌ సాధించిన విజయం జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సంతోషాన్నివ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet