iDreamPost
android-app
ios-app

Allu Arjun: ఒకే వేదికపై NTR-బన్నీ? మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..

  • Published Aug 07, 2024 | 3:57 PM Updated Updated Aug 07, 2024 | 3:57 PM

ఒకే వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనువిందు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఒకే వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనువిందు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 07, 2024 | 3:57 PMUpdated Aug 07, 2024 | 3:57 PM
Allu Arjun: ఒకే వేదికపై NTR-బన్నీ? మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..

ఒకేసారి ఇద్దరు ముగ్గురు బడా హీరోలను స్టేజ్ పై చూడాలని కలలు కంటూ ఉంటారు సినీ అభిమానులు. అయితే సినిమా ఫంక్షన్స్ టైమ్ లోనే ఇది సాధ్యం అవుతుంది. లేదా ప్రముఖుల పెళ్లిలోనే ఇలాంటి అరుదైన ఘట్టాలు ఆవిష్కృతం అవుతూ ఉంటాయి. అలాంటి ఓ అద్భుత ఘట్టానికి ఓ సినిమా ఫంక్షన్ వేదిక కానుంది. ఒకే వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనువిందు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఆయ్’.. అంజిబాబు దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన చిత్రం. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ లాంటి బడా సినిమాల మధ్యలో రిలీజ్ అవుతోంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను గట్టిగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఇక ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లను ముఖ్య అతిథులుగా తీసుకురావాలని ప్లాన్ వేస్తున్నారట. ఈ స్టార్ హీరోలను తమ ఈవెంట్ కు తీసుకురావడం ద్వారా పబ్లిసిటీ పీక్స్ చేరుకుంటుందన్నది మేకర్స్ భావన. అయితే వారు రావడానికే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే?

ఆయ్ సినిమా హీరో నార్నే నితిన్ తారక్ కు బావమరిది. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్ కావడంతో అల్లు అర్జున్ కూడా రావడానికి సిద్ధంగానే ఉంటారు. దాంతో వీరిద్దరిని ఒకే వేదికపై చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వీరిద్దరు ఒకే స్టేజ్ పై కనిపిస్తే.. ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. ఈ క్షణం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. పూర్తి లవ్ అండ్ ఫన్ మూవీగా ఆయ్ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇందులో నార్నే నితిన్ కు జోడీగా నయన్ సారిక నటిస్తోంది. రామ్ మిరియాల మ్యూజిక్ అందించాడు. మరి ఒకే స్టేజ్ పై తారక్-బన్నీలను చూడాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet