iDreamPost
android-app
ios-app

Mahesh Babu: మురారి రీ రిలీజ్: సిగ్గు లేకుండా వెళ్లి మహేష్ బాబుని భోజనం అడిగా: నటుడు చిన్నా!

  • Published Aug 07, 2024 | 3:03 PM Updated Updated Aug 07, 2024 | 3:03 PM

ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా మురారి చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ మూవీలో నటించిన సీనియర్ నటుడు చిన్నా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా మురారి చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ మూవీలో నటించిన సీనియర్ నటుడు చిన్నా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

  • Published Aug 07, 2024 | 3:03 PMUpdated Aug 07, 2024 | 3:03 PM
Mahesh Babu: మురారి రీ రిలీజ్: సిగ్గు లేకుండా వెళ్లి మహేష్ బాబుని భోజనం అడిగా: నటుడు చిన్నా!

మురారి.. సూపర్ స్టార్ మహేశ్ బాబు-సోనాలి బింద్రే జంటగా 2001లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. డైరెక్టర్ కృష్ణవంశీ ఫ్యామిలీ ఆడియెన్స్ కట్టిపడేసే విధంగా సినిమాను తెరకెక్కించాడు. ఇక మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ప్రస్తుతం మురారి సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దానికి కారణం ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో నటించిన కొందరు నటీ, నటులు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటుడు చిన్నా మురారి సినిమా టైమ్ లో మహేశ్ బాబుతో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వెల్లడించాడు.

మురారి.. మహేశ్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ లిస్ట్ తీస్తే.. అందులో కచ్చితంగా ఈ సినిమా ఉంటుంది. కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ మూవీ మహేశ్ బర్త్ డే కానుకగా ఆగస్ట్ 9న రీ- రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో మురారి సినిమాలో నటించిన కొందరు నటీ, నటులు ఇంటర్వ్యూలు ఇస్తూ.. అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు చిన్నా మురారి మూవీ సమయంలో మహేశ్ తో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Chinna

చిన్నా మాట్లాడుతూ..”మురారి సినిమా కోసం 50 రోజులు అవుట్ డోర్ షూటింగ్ చేయాల్సి వచ్చింది. రామచంద్రాపురం అనే గ్రామంలో షూటింగ్ జరుగుతోంది. అందరికి ప్రొడక్షన్ ఫుడ్ వచ్చేది. కానీ నాకు ఆ ఫుడ్ పడేది కాదు. నేను షూటింగ్ లో ఉంటే ఇంటి దగ్గర నుంచి బాక్స్ వచ్చేది. కానీ అవుట్ డోర్ కావడంతో ఆ ఫెసిలిటి లేకుండా పోయింది. అయితే కష్టపడి రెండు రోజులు ప్రొడక్షన్ ఫుడ్ తిన్నాను. కానీ నా వల్ల కాలేదు. ఇక ఇదే సమయంలో మహేశ్ బాబు కు నిర్మాత చెల్లిలు అక్కడే ఉండటంతో.. ఆయనకు ఇంటి నుంచి ఫుడ్ వచ్చేది. నా సమస్యను ఒకరోజు మహేశ్ బాబుకు చెప్పి.. మీ ఫుడ్ పెడతారా? అని సిగ్గులేకుండా అడిగాను. దానికి ఆయన దాంట్లో ఏముంది, వచ్చి తినండి అని చెప్పారు. నాతో పాటుగా శివాజీరాజా కూడా వచ్చేవాడు. అలా ఏకంగా 50 రోజులు మహేశ్ బాబు కోసం వచ్చిన ఫుడ్ ను తిన్నాం. కొన్నిసార్లు మహేశ్ కు షూటింగ్ లో లేట్ అయితే.. మీరు తినండి, నేను తర్వాత తింటాను అని చెప్పేవారు. మమ్మల్ని మహేశ్ అంత బాగా చూసుకున్నారు” అని చెప్పుకొచ్చాడు ఈ సినియర్ యాక్టర్. ప్రస్తుతం చిన్నా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మహేశ్ గొప్ప మనసును ప్రశంసిస్తున్నారు అభిమానులు. ఇక మురారి రీ-రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొడుతోంది. ప్రీ సేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. హాట్ కేకుల్లా అమ్ముడైయ్యాయి. దీంతో అత్యంత వేగంగా రూ. కోటి వసూల్ చేసిన మూవీగా మురారి నిలిచింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss