iDreamPost
android-app
ios-app

‘జవాన్’ ట్రైలర్​లో ఊహించని ట్విస్ట్! ఈ పాన్ ఇండియా హీరోను గుర్తించారా?

ఇండియన్ మూవీస్ అంటే హిందీ చిత్రాలే అన్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ పరిస్థితుల్లో గత కొన్నేళ్లలో అనూహ్య మార్పులు వచ్చాయి. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’, ‘కాంతార’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో ఇప్పుడు ఇండియన్ మూవీస్ అంటే సౌత్ ఇండస్ట్రీనే అందరికీ గుర్తుకొస్తున్నాయి.

ఇండియన్ మూవీస్ అంటే హిందీ చిత్రాలే అన్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ పరిస్థితుల్లో గత కొన్నేళ్లలో అనూహ్య మార్పులు వచ్చాయి. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’, ‘కాంతార’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో ఇప్పుడు ఇండియన్ మూవీస్ అంటే సౌత్ ఇండస్ట్రీనే అందరికీ గుర్తుకొస్తున్నాయి.

‘జవాన్’ ట్రైలర్​లో ఊహించని ట్విస్ట్! ఈ పాన్ ఇండియా హీరోను గుర్తించారా?

బాలీవుడ్.. నిన్నమొన్నటి వరకు భారతీయ సినిమాలకు మెయిన్ పిల్లర్​గా ఉంటూ వచ్చింది. ఇండియన్ మూవీస్ అంటే హిందీ చిత్రాలే అన్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ పరిస్థితుల్లో గత కొన్నేళ్లలో అనూహ్య మార్పులు వచ్చాయి. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’, ‘కాంతార’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో ఇప్పుడు ఇండియన్ మూవీస్ అంటే సౌత్ ఇండస్ట్రీనే అందరికీ గుర్తుకొస్తున్నాయి. అయితే బాలీవుడ్​ మాత్రం తన ఛరిష్మాను తిరిగి పొందే ప్రయత్నం చేస్తోంది. మెగా హిట్స్​తో ఇండస్ట్రీని నంబర్ వన్ పొజిషన్​లోకి తీసుకొచ్చేందుకు అక్కడి హీరోలు బాగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ లాంటి ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు.

గత కొన్నేళ్లుగా పెద్దగా హిట్స్ లేక ఫామ్ కోల్పోయిన షారుక్.. ఎట్టకేలకు ఒక విజయంతో రేసులోకి వచ్చారు. ఆయన నటించిన ‘పఠాన్’ ఈ ఏడాది ఆరంభంలో విడుదలై బ్లాక్​ బస్టర్​గా నిలిచింది. షారుక్ మూవీకి మంచి టాక్ వస్తే దాని సక్సెస్ రేంజ్ ఏ లెవల్లో ఉంటుందో ‘పఠాన్’తో ప్రూవ్ అయింది. రూ.1,000 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన షారుక్.. ఇదే ఏడాది మరో మూవీతో ఆడియెన్స్​ను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమానే ‘జవాన్’. కోలీవుడ్ మోస్ట్ సక్సెస్​ఫుల్​ డైరెక్టర్ అట్లీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘పఠాన్’ హిట్​తో షారుక్ ఫామ్​లోకి రావడం, అట్లీ డైరెక్షన్ చేయడం, విజయ్​ సేతుపతి, నయనతార, ప్రియమణి, దీపికా పదుకొణె లాంటి స్టార్లు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తుండటంతో ‘జవాన్​’పై అంచనాలు ఒక రేంజ్​లో ఉన్నాయి.

‘జవాన్’ రిలీజ్ కోసం కింగ్ ఖాన్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఇవాళ ఈ మూవీ ట్రైలర్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. యూట్యూబ్​లో తుఫాన్​గా మారిందీ ట్రైలర్. అనిరుధ్ రవిచంద్రన్ అదిరిపోయే బీజీఎంతో దుమ్మరేపాడు. సూపర్బ్​గా ఉన్న ఈ ట్రైలర్​లో నయనతార యాక్షన్ స్టంట్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్​ను ఫ్యాన్స్ గుర్తించారు. ఒక సీన్​లో విజయ్​ చేతుల్లో గన్స్​తో స్టంట్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది దళపతేనా లేదా వేరే వ్యక్తా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే అది పక్కా విజయ్​ అంటూ అభిమానులు ఆ స్టిల్స్​ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ‘జవాన్’లో విజయ్ గెస్ట్ రోల్​లో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. మరి.. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by TeaKadai Raja (@teakadai_raja)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet