iDreamPost
android-app
ios-app

ఓటిటి పార్టనర్ ని లాక్ చేసుకున్న జవాన్..!

  • Author ajaykrishna Updated - 01:10 PM, Wed - 13 September 23
  • Author ajaykrishna Updated - 01:10 PM, Wed - 13 September 23
ఓటిటి పార్టనర్ ని లాక్ చేసుకున్న జవాన్..!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. పఠాన్ సక్సెస్ తో ఏడాదిని ఆరంభించిన షారుఖ్.. సెకండాఫ్ ని జవాన్ తో కంప్లీట్ చేస్తున్నారు. తన కెరీర్ తో బాలీవుడ్ లోను ఓ ఊపు తీసుకొచ్చేశాడు. దాదాపు ఎనిమిదేళ్లుగా సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న షారుఖ్.. ఒక్కసారిగా పఠాన్ తో రూ. 1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టేసాడు. ఇంకేముంది.. ఫ్యాన్స్ కోరుకున్న సాలిడ్ సక్సెస్ రానే వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ముందునుండి భారీ అంచనాలు సెట్ చేసిన ఈ మూవీ.. ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

కట్ చేస్తే.. సినిమా నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఆరవ రోజుకి రూ. 600 కోట్ల క్లబ్ చేరింది జవాన్. తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన జవాన్.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ జవాన్ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా బిగ్ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా.. దీపికా పదుకొనే, సంజయ్ దత్ క్యామియో రోల్స్ లో మెరిశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి జవాన్ లో విలన్ గా నటించాడు. అయితే.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ జోడించి జవాన్ తీశాడు దర్శకుడు అట్లీ.

షారుఖ్ ఖాన్ తో సౌత్ ఇండియన్ ఫుల్ మీల్స్ రెడీ చేసి రిలీజ్ చేశాడు. అక్కడి ప్రేక్షకులకు ఈ మధ్య సౌత్ సినిమాలు ఎక్కువ నచ్చుతున్నాయి. సో.. షారుఖ్ నటించిన సౌత్ ఇండియన్ మసాలా అంటే.. అక్కున చేర్చుకొని మరీ జవాన్ ని ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం పఠాన్ తర్వాత.. జవాన్ కూడా రూ. 1000 కోట్ల వైపు టార్గెట్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. జవాన్ ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. బిగ్ డీల్ కి జవాన్ ఓటిటి డీల్ ముగిసిందట. దాదాపు రూ. 250 కోట్లకు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ సంస్థ జవాన్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి జవాన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet