iDreamPost
android-app
ios-app

షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ఏ OTTలోకి అంటే?

  • Published Sep 07, 2023 | 2:13 PM Updated Updated Nov 02, 2023 | 11:33 PM
  • Published Sep 07, 2023 | 2:13 PMUpdated Nov 02, 2023 | 11:33 PM
షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ఏ OTTలోకి అంటే?

గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస ఫ్లాపులతో చతికిలపడిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన ‘పటాన్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పటాన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు వచ్చాయి. ఇదే ఊపుతో ఈ ఏడాది స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారూఖ్ ఖాన్. ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన నటీనటులు ఎక్కువగా నటించారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పూర్తి యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రం గురువారం, సెప్టెంబర్ 07న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘జవాన్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం టీజర్ రిలీజ్, ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో భారీ ఓపెనింగ్స్ ని రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మూవీపై పాజిటీవ్ టాక్ వినిస్తుందని అంటున్నారు. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ తన విశ్వరూపాన్ని చూపించాడని.. అట్లీ టేకింగ్ చాలా అద్భుతంగా ఉందని, అనిరుధ్ మ్యూజిక్ నెక్ట్స్ లెవల్ అంటూ ప్రేక్షకులు అంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే.. జవాన్ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లోకి వెళ్లడం ఖాయం అంటున్నారు షారూఖ్ ఫ్యాన్స్.

ఇక జవాన్ చిత్రం డిజిటల్, శాటిలైట్ పార్ట్‌నర్స్ ని ఫిక్స్ చేసుకుంది. డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఛానెల్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. శాటిలైట్ ఛానల్ ప్రముఖ టీవీ జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సౌత్ బ్యూటీ నయనతార. పాన్ ఇండియా నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఈ మూవీలో నెగిటీవ్ పాత్రలో దుమ్మురేపినట్లు సమాచారం. ప్రియమణి, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు చిన్న పాత్రలో నటించినట్లు సమాచారం. గెస్ట్ పాత్రలో దీపికా పదుకొని నటించింది. మొత్తానికి ఈ మూవీ డే వన్ సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet