iDreamPost
android-app
ios-app

Jani Master Case: ఆ అమ్మాయి తల్లే అంతా చేసింది.. జానీ భార్య సంచలన కామెంట్స్!

  • Published Sep 21, 2024 | 2:22 PM Updated Updated Sep 21, 2024 | 2:22 PM

Jani Master wife Ayesha Key Comments: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక ఈ వివాదంపై జానీ మాస్టర్ భార్య సంచలన కామెంట్స్ చేసింది.

Jani Master wife Ayesha Key Comments: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక ఈ వివాదంపై జానీ మాస్టర్ భార్య సంచలన కామెంట్స్ చేసింది.

  • Published Sep 21, 2024 | 2:22 PMUpdated Sep 21, 2024 | 2:22 PM
Jani Master Case: ఆ అమ్మాయి తల్లే అంతా చేసింది.. జానీ భార్య సంచలన కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడంటూ ఆయన దగ్గర పని చేసే అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. అంతేకాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ పై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్టు కావడం, చంచల్ గూడ జైలుకు తరలించడం జరిగింది. ఇది ఇలా  ఉంటే.. జానీ మాస్టర్ వివాదంపై ఆయన భార్య ఆయేషా సంచలన కామెంట్స్ చేసింది. జానీ మాస్టర్ పై కుట్ర చేశారని, ఇదంతా ఫ్యామిలీ హానీ ట్రాప్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాజాగా జానీ మాస్టర్ భార్య  ఆయేషా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అనేక కొత్త విషయాలను చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయి తల్లి ..ఉద్దేశ పూర్వకంగానే తన కూతుర్ని జానీ మాస్టర్ దగ్గరికి పంపించిందని తెలిపింది. ఆ యువతి ఫ్యామిలీ బాగా ఉన్నవాళ్లను చూసుకుని ట్రాప్ లో పడేస్తారని తెలిపింది. జానీ మాస్టర్ ఆ అమ్మాయికి ఎంత బంగారం కొనిచ్చారు, ఎంత క్యాష్ ఇచ్చారు అనే ఫ్రూప్స్ తన దగ్గర ఉన్నాయని ఆయేషా అన్నారు. ఆ అమ్మాయి మాయ మాటలు చెప్పి, అబద్దాలు చెప్పే… జానీ మాస్టర్ దగ్గరకు చేరిందన్నారు.

ఆ అమ్మాయి తల్లికు పని కావాలి. ఈ క్రమంలో బాగా ఫేమస్ అయినా, డబ్బున్న వారిపై కన్నేస్తారు. మీరు చచ్చిపోతున్నా మీ దగ్గర పని కావాలి..మీతోనే ఉంటానంటూ డ్రామాలు ఆడుతారని తెలిపింది. అలానే  ఆయువతి కూడా తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తన కెరీర్ ను కాపాడలంటూ జానీ మాస్టర్ దగ్గర చేరింది. ఆ తరువాత ఆయన దగ్గర ఒకలా, తన దగ్గర మరోలా ఉండేదని ఆయేషా చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయి ప్రవర్తన కారణంగా..తాను ఆత్మహత్య ప్రయత్నించాలనని తెలిపింది. తనను, తన పిల్లలను జానీ మాస్టర్ నుంచి దూరం చేసేందుకు ఆ  అమ్మాయి ప్రయత్నించిందన్నారు ఆయేషా.  ఆ అమ్మాయి తన కెరీర్ కోసం ఏదైనా చేస్తుందని, ఆ యువతి తల్లి సైకో అంటూ ఆయేషా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయికి మద్దతు ఇస్తున్నారో..వారు కూడా త్వరలో మీడియా ముందుకు వచ్చి.. ఇదే విధంగా కూర్చుంటారు. వారు ఎంత పెద్ద స్టార్ అయిన సరే…వారికి ఇదే పరిస్థితి వస్తుందని ఆయేషా చెప్పుకొచ్చారు. అసలు ఈ ఇష్యూ మొత్తానికి కారణం ఆ యువతి తల్లే అని, ముందు ఆమెను జైల్లో వేయ్యాలంటూ ఆయేషా ఫైర్ అయ్యారు. ఆమెకు తెలియకుండా తన కూతురు ఈ పనులు  అన్ని చేస్తుందా?. ఒకవేళ ఆమెకు తెలిసే..చేస్తే..ఎందుకు అడ్డుచెప్పలేదంటూ ఆయేషా ప్రశ్నించారు. అసలు జానీ మాస్టర్ ను కుట్ర చేసి..ఈ వివాదంలో ఇరికించారని, దీని వెనుక పెద్ద ప్లానే ఉందంటూ ఆయేషా చెప్పుకొచ్చారు. మరి..బాధితురాలి తల్లిపై ఆయేషా చేసిన  వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş