iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్ : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్!

  • Published Sep 19, 2024 | 11:29 AM Updated Updated Sep 19, 2024 | 1:43 PM

Jani Master Arrest: సినీ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.

Jani Master Arrest: సినీ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.

బిగ్ బ్రేకింగ్ : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఆయన వద్ద ఉన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని గత కొంత కాలంగా లైంగికంగా వేధిస్తూ, దాడులు చేస్తూ, పెళ్లి చేసుకోవాలని  వేధిస్తున్నట్లు  రాయదుర్గం  పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మీడియాలో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ పేరే వినిపిస్తుంది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు.  అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో సైబరాబాద్ SOT అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ కి తరలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత మూడు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ ని గోవాలో ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత గోవా కోర్టులో హాజరు పర్చిన పోలీసులు.. పీటీ కేసు కింద హైదరాబాద్ కి తరలిస్తున్నట్లు సమాచారం. రేపు ఉప్పర్ పల్లి కోర్టుకు హాజరు పర్చనున్నట్లు సమాచారం.    కొంత కాలంగా జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్న యువతి  తనపై పలు మార్లు లైంగిక వేధింపులు, అత్యాచార ప్రయత్నాలు చేశాడని, ఇటీవల మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు జానీ మాస్టర్ పై తొలుత రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ భాషపై పోలీసులు IPC 376, 323, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తర్వాత  ఫోక్సో కింద అతనిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచి వేధింపులు చేయడం వల్ల ఫోక్సో కేసు పెట్టారు. కేసు నమోదు అయినప్పటి నుంచి  జానీ మాస్టర్ ఐదురోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన ఉత్తరాది రాష్ట్రాకు పారిపోయారని.. హైదరాబాద్ లో తన స్నేహితుల వద్ద తలదాచుకున్నాడని రక రకాల ఊహాగానాలు వినిపించాయి.

జానీ మాస్టర్ ని వెతికేందుకు నాలుగు బృందాలు బయలుదేరాయి. ఈ క్రమంలోేనే లద్దాక్, జమ్ము, నెల్లూరు జిల్లాల్లో పోలీసులు తీవ్రంగా గాలించారు.  ఎట్టకేలకు అతన్ని బెంగుళూరులో అరెస్ట్ చేసి.. హైదరాబాద్ తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, గతంలో జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణులు రావడంతో ఆరు నెలలు జైల్లో ఉన్నాడు. జానీ మాస్టర్ అరెస్ట్ విషయం తెలియగానే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయం పై ఇండస్ట్రీలో రక రకాల చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటు 40 పేజీలతో కూడిన లేఖను బాధితురాలు మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారదకు ఇచ్చారు. ఈ క్రమంలోనే బాధితురాలికి అండగా ఉండటమే కాదు.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామాని హామీ ఇచ్చారు.