iDreamPost
android-app
ios-app

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి బాటలోనే..

Janhvi Kapoor At Tirumala: అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా తల్లి శ్రీదేవి బాటలో నడుస్తోంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Janhvi Kapoor At Tirumala: అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా తల్లి శ్రీదేవి బాటలో నడుస్తోంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి బాటలోనే..

ఆలిండియా క్వీన్ గా సూపర్ ఇమేజ్ ని సాధించిన శ్రీదేవి డాటర్స్ జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరూ నిన్న తిరుమలలో హల్ చల్ చేశారు. జూన్ 6వ తేదీన జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా తన సిస్టర్ ఖుషీ కపూర్ తో కలసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు అక్కడంతా సందడి నెలకొంది. వీఐపీ ఎంట్రన్స్ లోనుంచి వాళ్ళకి ప్రవేశం కల్పించారు టీటీడీ యాజమాన్యం. గర్భగుడి ముందే శాస్త్రోక్తంగా సాగిలపడి సాష్టాంగ నమస్కారాలు చేసి, వేదమంత్రాల నడుమ శ్రీవారిని దర్శనం చేసుకుని బైటకొచ్చారు.

ఈ వీడియో మొత్తం ప్రపంచమంతా హై రేంజ్ లో వైరల్ అయింది. సరే వాళ్ళు శ్రీవారి దర్శనం గురించి వచ్చారు. కానీ అందులో స్పెషల్ టచ్ ఏంటంటే ఈ మథ్య జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ అని బాలీవుడ్ అంతా కోడై కూస్తున్న శిఖర్ పహారియా కూడా వాళ్ళతో పాటు పంచె, ఖండువాతో చాలా శాస్త్రీయంగా కనిపించడమే. అక్కచెల్లెళ్ళు ఇద్దరూ పట్టు చీరలు కట్టుకుని సనాతన తమిళ సంప్రదాయంలో కనబడితే, శిఖర్ కూడా అదే తమిళ కట్టులో అక్కడికి రావడంతో సోషల్ మీడియా ఈ విజువల్ని విపరీతంగా వైరల్ చేసేసింది.

ఈ సంవత్పరంతో 26 ఏళ్ళు నిండుతున్న సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల సందర్శనానికి వచ్చింది. ఇద్దరు కపూర్ సిస్టర్స్ తో పాటు తెలుగులో చాలా సినిమాలు చేసిన అలనాటి మహేశ్వరి కూడా రావడంతో ఆలయం బైటకొచ్చిన తర్వాత కొందరు వాళ్ళ వెనకపడి సెల్ఫీలు తీసుకోవడానికి తోసుకున్నారు. మొత్తానికి కపూర్ సిస్టర్స్ వాళ్ళ మదర్ శ్రీదేవి పెట్టిన సంప్రదాయాన్ని పొల్లు పోకుండా కొనసాగించడమే ఇందులో విశేషం.

శ్రీదేవికి తిరుపతి అంటే..

మన అందాల నటి శ్రీదేవికి తిరుమల అన్నా, శ్రీ వేంకటేశ్వర దర్శనమన్నా మహాభక్తి. దాదాపుగా తను నటి అయిన దగ్గర్నుంచీ ప్రతీ పుట్టినరోజుకి తిరుమల వచ్చి బ్రహ్మాండనాయకుడి దర్శనం చేసుకుని వెళ్ళడం శ్రీదేవి చాలా స్ట్రిక్టుగా పాటించింది. అలాగే ప్రతీ సినిమా రిలీజుకి కాలినడకన కొండెక్కి దర్శనం చేసుకోవడం శ్రీదేవి జీవితమంతా కొనసాగించింది. తమిళ సంప్రదాయంలో పెరిగిన శ్రీదేవి కఠినమైన నియమనిష్టలతో తిరుమల దర్శనమనే ఆనవాయితీని ఏనాడూ విడిచిపెట్టలేదు. అదే రివాజును ఆమె కుమార్తెలు ఇప్పుడు కొనసాగించడాన్ని కొందరు నెటిజన్లు మనసా మెచ్చుకుంటున్నారు. జాన్వీ కపూర్ కూడా తల్లిలాగే సినిమా పరిశ్రమలోకి ప్రవేశించడంతో తల్లి అడుగుజాడలలోనే నడుస్తున్నట్టయింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో తొలిసారిగా కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో రామ్ చరణ్ కాంబోలో కూడా కనిపించబోతోంది జాన్వీ కపూర్.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet