iDreamPost
android-app
ios-app

Jr. NTR తరువాత రామ్ చరణ్! జాన్వీ స్పీడ్ అదిరింది!

  • Published Feb 07, 2024 | 12:17 PM Updated Updated Feb 07, 2024 | 12:17 PM

దక్షిణాది ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ఏకైన నటి మన అతిలోక సుందరి శ్రీదేవి. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఈ దంపతుల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ పరిశ్రమలోకి ఎంటరై..

దక్షిణాది ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ఏకైన నటి మన అతిలోక సుందరి శ్రీదేవి. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఈ దంపతుల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ పరిశ్రమలోకి ఎంటరై..

  • Published Feb 07, 2024 | 12:17 PMUpdated Feb 07, 2024 | 12:17 PM
Jr. NTR తరువాత రామ్ చరణ్! జాన్వీ స్పీడ్ అదిరింది!

వెండితెరపై ఎవర్ గ్రీన్ నటిగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది మన అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు తల్లయినా కూడా ఆమె అందం ఇసుమంతైనా తగ్గలేదు. సుమారు దాదాపు 15 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న ఆమె.. ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీతో మళ్లీ తెరపైకి వచ్చింది. పలు సినిమాలు చేసింది. అంతలో పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ముమ్మురంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె తొలి సినిమా పట్టాలెక్కి.. రిలీజ్‌కు సిద్ధమైంది. కుమార్తెను తెరపై చూసుకోకుండానే ఆ మహానటి 2018లో ప్రమాదవశాత్తూ కన్నుమూసింది.

అదే ఏడాది దడఖ్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. గుంజన్ సక్సేనా మూవీలో ఆమె నటనకు మంచి మార్కుల పడ్డాయి. గుడ్ లక్ జెర్రీ, మిలీ, భావల్ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మడు తన అమ్మ వారసత్వాన్ని కొనసాగించేందుకు.. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. శ్రీదేవి తనయ టాలీవుడ్ మూవీలో నటిస్తుంది అనగానే సంబర పడ్డారు శ్రీదేవి అభిమానులు. అందులోనూ తనకు ది బెస్ట్ స్క్రీన్ జోడిగా పేరు గాంచిన సీనియర్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా అనగానే.. ఫుల్ ఖుషీ అయ్యారు. దేవర మూవీలో జాన్వీకపూర్‌ను ఫిక్స్ చేస్తూ ఆమె తొలి పిక్ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. దీంతో శ్రీదేవి మళ్లీ వచ్చిందని మురిసిపోయారు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకుడు. ఆ ఏడాది సెకండాఫ్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఇప్పడు జాన్వీ మరింత స్పీడ్ పెంచేసింది. దేవర చిత్రం విడుదల కాకుండానే ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది.  రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఈ సినిమాను సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్ సి 16 మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ.. లెజండరీ రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడి బయోపిక్ అని వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఉత్తరాంధ్రతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అక్కడ కాస్టింగ్ రిక్యూట్ చేసుకునే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గేమ్ ఛేంజర్ అయిపోయాక.. ఈ షూటింగ్ షురూ చేయనున్నారని తెలుస్తోంది. జాన్వీ కపూర్ తొలి సినిమా విడుదల కాకుండానే మరో బడా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. మీరు శ్రీదేవి ఫ్యానా..? జాన్వీ తొలి తెలుగు సినిమా కోసం ఎదురు చూస్తున్నారా..? కామెంట్స్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet