iDreamPost
android-app
ios-app

చరణ్ పై మనసు పారేసుకున్న జాన్వీ! వైరల్ అవుతున్న కామెంట్స్!

  • Author ajaykrishna Updated - 01:28 PM, Mon - 10 July 23
  • Author ajaykrishna Updated - 01:28 PM, Mon - 10 July 23
చరణ్ పై మనసు పారేసుకున్న జాన్వీ! వైరల్ అవుతున్న కామెంట్స్!

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అక్కడినుండి తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఓకే చేశాడు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ డెబ్యూ చేసిన బుచ్చిబాబు.. ఆలస్యం అయినా సరే ఇంతకాలం స్టార్ హీరోతోనే సినిమా చేయాలని రెండేళ్లు వెయిట్ చేశాడు. మొదట ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందని అంతా అనుకున్నారు. ఏమైందో గాని.. అనూహ్యంగా రామ్ చరణ్ మూవీ అనౌన్స్ చేశాడు బుచ్చిబాబు.

ఈ క్రమంలో ప్రెజెంట్ ఈ సినిమా కోసం కాస్టింగ్ పనిలో ఉన్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే అయిపోయారు. సో.. హీరోయిన్ విషయం వచ్చేసరికి.. పేర్లు బయటికి రాట్లేదు. కొన్నిరోజులు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు బలంగా వినిపించింది. కానీ.. ఇప్పటిదాకా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు ఎన్టీఆర్ – కొరటాల ‘దేవర’ మూవీలో జాన్వీ అవకాశం అందుకుంది. ఇలాంటి తరుణంలో రామ్ చరణ్ గురించి తాజాగా జాన్వీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ కామెంట్స్ బట్టి చూస్తే.. గుట్టుచప్పుడు కాకుండా జాన్వీ.. రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో ఓకే అయిపోయినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే.. రామ్ చరణ్ గురించి జాన్వీ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటిదాకా చూసినవారిలో రామ్ చరణ్ దే హోల్ సమ్ పర్సనాలిటీ. చరణ్ కి లుక్స్.. టాలెంట్.. అన్ని ఉన్నాయి. ఆయనతో కలిసి వర్క్ చేసేందుకు ఎంతో ఎక్సయిటింగ్ గా వెయిట్ చేస్తున్నా’ అనే విధంగా కామెంట్స్ చేసిందని టాక్. సో.. ఈ లెక్కన బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ సరసన అమ్మడు ఓకే అయినట్లే అనుకోవచ్చు అని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ.. దీనిపై మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా నిర్మాణంలో మైత్రి మూవీస్ వారితో పాటు సుకుమార్ కూడా భాగమవ్వడం విశేషం. మరో విషయం ఏంటంటే.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. మరి చరణ్ గురించి జాన్వీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలు తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)