iDreamPost
android-app
ios-app

జాన్వీకపూర్‌తో కలిసి ఆమె ఇంట్లో ఉండే ఛాన్స్! ఫుడ్డు, బెడ్డు ఫ్రీ..

  • Published May 03, 2024 | 10:25 PM Updated Updated May 03, 2024 | 10:25 PM

సినిమా హీరోయిన్స్ తో మాట్లాడాలని.. వారితో కాసేపు గడపాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ అవకాశం అంత ఈజీగా దొరుకుతుందా? కానీ ఈ సువర్ణావకాశాన్ని జాన్వీకపూర్ కల్పిస్తుంది.

సినిమా హీరోయిన్స్ తో మాట్లాడాలని.. వారితో కాసేపు గడపాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ అవకాశం అంత ఈజీగా దొరుకుతుందా? కానీ ఈ సువర్ణావకాశాన్ని జాన్వీకపూర్ కల్పిస్తుంది.

  • Published May 03, 2024 | 10:25 PMUpdated May 03, 2024 | 10:25 PM
జాన్వీకపూర్‌తో కలిసి ఆమె ఇంట్లో ఉండే ఛాన్స్! ఫుడ్డు, బెడ్డు ఫ్రీ..

సినిమా హీరోయిన్స్ తో లైఫ్ లో ఒక్కసారైనా గడపాలని.. వారితో కాసేపు మాట్లాడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ కలలో మాత్రమే వారు అనుకున్నవి జరుగుతాయి. నిజ జీవితంలో జరగవు. కానీ జాన్వీకపూర్ మాత్రం తనతో కలిసి ఉండే అవకాశాన్ని ఇస్తుంది. అవును మీరు విన్నది నిజమే. మీరు జాన్వీకపూర్ అంటే పడి చచ్చిపోతారా? అయితే జాన్వీకపూర్ ఇంట్లో మీరు ఉండవచ్చు. జాన్వీ చిన్నతనంలో నివసించిన ఇంట్లో గడిపే అవకాశం మీకోసమే. ఎయిర్ బీఎన్బీ అనే సంస్థ ఐకాన్స్ అనే కొత్త కేటగిరీని  పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 మంది సెలబ్రిటీలకు చెందిన ప్రాపర్టీస్ ని ఐకాన్స్ జాబితాలో ఉంచింది.

చెన్నైలో జాన్వీ ఉంటున్న ఇంటిని గతంలో శ్రీదేవి కొనుగోలు చేసింది. అయితే ఈ ఇంటిని ఇప్పుడు ఎయిర్ బీఎన్బీ అనే సంస్థ లిస్ట్ అవుట్ చేసింది. ఎయిర్ బీఎన్బీ అంటే ఎయిర్ బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్. ఇదొక సర్వీస్ అన్న మాట. ప్రాపర్టీ ఓనర్లు తమ ఇంటిలో కొంత ప్రదేశాన్ని రెంట్ కిస్తుంటారు. ఎవరైనా కొత్త ప్రయాణికులు ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళు సౌకర్యంగా ఉండడం కోసం వీలుండేలా ఇలా చేస్తారు. ఈ క్రమంలో జాన్వీకపూర్ కూడా తన విలాసవంతమైన ఇంటిని ఎయిర్ బీఎన్బీలో రెంట్ కి పెట్టింది. ఎయిర్ బీఎన్బీ సంస్థ జాన్వీ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బాలీవుడ్ స్టార్ జాన్వీకపూర్ లా జీవించండి అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టింది. జాన్వీకపూర్ తో కలిసి ఉండడానికి ఇద్దరు అతిథులను కూడా ఆహ్వానిస్తోందని సదరు సంస్థ తమ వెబ్ సైట్ లో పేర్కొంది. అయితే జాన్వీకపూర్ ఇంటిలో ఉండే గెస్టులకి ఒక బెడ్ రూమ్, ఒక బాత్రూంని మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది.

బుకింగ్ చేసుకున్న వారిలో తనతో పాటు తన ఇంట్లో ఎవరు ఉండాలి అనేది మాత్రం జాన్వీ నిర్ణయిస్తుంది. తాను ఎంపిక చేసిన అతిథులకు మాత్రం సౌత్ ఇండియన్ స్టైల్ లో లంచ్ ఉంటుంది. అందులో కూడా జాన్వీకి ఇష్టమైన నెయ్యి పొడి రైస్, పాలకోవా, ఆంధ్రా బిర్యానీ, పెసరట్టు దోస వంటివి వడ్డిస్తుందట. వచ్చిన అతిథులకు తన సహజమైన స్కిన్ కేర్ రొటీన్, టాప్ బాలీవుడ్ బ్యూటీ సీక్రెట్స్ చెప్తుందట. అంతేకాకుండా తన మధురమైన జ్ఞాపకాలను అతిథులతో షేర్ చేసుకుంటుందని వెబ్ సైట్ తెలిపింది. జాన్వీతో కలిసి ఉండాలంటే.. వెబ్ సైట్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. మే 12న సాయంత్రం 6.30కి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. కానీ మే 9 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. రెండు గ్రూపులకు చెందిన ఇద్దరు అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా జాన్వీతో కలిసి ఉండే లైఫ్ టైం ఆపర్చునిటీ అని ఎయిర్ బీఎన్బీ తెలిపింది. మరింకనే మీరు జాన్వీ ఫ్యాన్స్ అయితే.. జాన్వీతో కలిసి గడపాలనుకుంటే కనుక మే 12న కింది వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోండి.

 

 

View this post on Instagram

 

A post shared by Airbnb (@airbnb)

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/