iDreamPost
android-app
ios-app

Janhvi Kapoor: డేటింగ్ లో ‘దేవర’ బ్యూటీ జాన్వీ! పొరపాటున పేరు చెప్పేసిందిగా..

  • Published Jan 01, 2024 | 8:53 PM Updated Updated Jan 01, 2024 | 8:53 PM

కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న దేవర బ్యూాటీ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. అందులో భాగంగానే ఓ వ్యక్తి పేరు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అతడితో ఆమె డేటింగ్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న దేవర బ్యూాటీ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. అందులో భాగంగానే ఓ వ్యక్తి పేరు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అతడితో ఆమె డేటింగ్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

  • Published Jan 01, 2024 | 8:53 PMUpdated Jan 01, 2024 | 8:53 PM
Janhvi Kapoor: డేటింగ్ లో ‘దేవర’ బ్యూటీ జాన్వీ! పొరపాటున పేరు చెప్పేసిందిగా..

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన అందచందాలతో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతూ.. పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. గతేడాది బవాల్ చిత్రంలో మెరిసిన ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో నటిస్తోంది. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది జాన్వీ. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చింది. పొరపాటున ఓ వ్యక్తి పేరు చెప్పడంతో.. అయితే అతడితో డేటింగ్ లో ఉన్న మాట నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి జాన్వీ నోటి నుంచి వచ్చిన ఆ పేరు ఎవరిది? పూర్తి వివరాల్లోకి వెళితే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో జాన్వీ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా దేవర గ్లింప్స్ ను జనవరి 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ క్రేజీ అప్డేట్ ను అభిమానులు ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ కాఫీ విత్ కరణ్ షో సీజన్ 8లో పాల్గొంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో జాన్వీ ఫుల్ జోష్ లో కనిపించి అల్లరి చేసింది. ఇక ఎప్పటిలాగే కరణ్ జోహార్ తన ప్రశ్నలతో తనకు కావాల్సిన కంటెంట్ ను రాబట్టుకునే ప్రయత్నం చేశాడు.

అందులో భాగంగా జాన్వీని ప్రశ్నిస్తూ.. ‘నీ స్పీడ్ డయల్ నంబర్స్ లో ముగ్గురు పేర్లు చెప్పు’ అని ప్రశ్నించగా.. డాడీ, ఖుషు, శిక్కు అని ఠక్కున పేర్లు చెప్పి నోరు కరుచుకుంది. దీంతో ఆశ్చర్యంతో కరణ్ ఆమె వైపు చూశాడు. జాన్వీ ఆన్సర్ తో శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్ లో ఉందన్న వార్తలకు బలం చేకూర్చినట్లు అయ్యింది. గతంలో జాన్వీ-శిఖర్ లు జంటగా చాలా సార్లు కనిపించారు. దీంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వీరి రిలేషన్ పై ఓపెన్ అప్ అవ్వలేదు. తాజాగా శిఖర్ పేరు చెప్పడంతో అతడితో ఈ బ్యూటీ డేటింగ్ లో ఉన్నమాట వాస్తవమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ షోలో తన సోదరి ఖుషీ కపూర్ తో కలిసి పాల్గొంది జాన్వీ. కాఫీ విత్ కరణ్ సీజన్ 8 ఫుల్ ఎపిసోడ్ జనవరి 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. జాన్వీ చెప్పిన పూర్తి విషయాలు తెలియాలి అంటే జనవరి 4 వరకు ఆగాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetorder girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş