iDreamPost
android-app
ios-app

Jana Gana Mana : మహేష్ డ్రాప్ అయిన సినిమాతో రౌడీ బాయ్

  • Published Mar 29, 2022 | 3:59 PM Updated Updated Mar 29, 2022 | 3:59 PM
Jana Gana Mana : మహేష్ డ్రాప్ అయిన సినిమాతో రౌడీ బాయ్

ఇవాళ విజయ్ దేవరకొండ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. లైగర్ తర్వాత పూరి జగన్నాధ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘జనగణమన'(JGM)ను ఓ థీమ్ పోస్టర్ తో ప్రకటించారు. కాన్సెప్ట్ దేశభక్తని సులభంగా అర్థమవుతోంది. కాకపోతే ఆ సెటప్ గట్రా చూస్తుంటే ఏదో యుద్ధానికి సంబంధించిన సబ్జెక్టుగా తోస్తోంది. ఇంతకు మించి అందులో వివరాలేమీ లేవు. విడుదల తేదీ ఆగస్ట్ 3 చూసి కొందరు షాక్ అయ్యారు కానీ ఆ డేట్ ఈ ఏడాదికి కాదు. 2023 కోసం. అంటే ఇంకా ఏడాదికి పైగా టైం ఉందన్న మాట. లైగర్ ఈ సంవత్సరం ఆగస్ట్ 25 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అంటే మళ్ళీ 12 నెలల తర్వాత రౌడీ బాయ్ పూరిలు వస్తారన్న మాట.

ఇందులో కొన్ని ఆశ్చర్యం కలిగించే అంశాలు ఉన్నాయి. నిర్మాణ భాగస్వామిగా వంశీ పైడిపల్లి ఉన్నారు. కేవలం పార్ట్ నర్ గానేనా లేక స్క్రిప్ట్ విషయంలో ఏమైనా సహకారాలు అందించారా అనేది వేచి చూడాలి. మహర్షి తర్వాత గ్యాప్ వచ్చేసిన వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా ఒకే అయ్యాక ఆ పనుల మీద ఉన్నారు. బీస్ట్ ప్రమోషన్ పూర్తయ్యాక విజయ్ దీని రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. ఆ గ్యాప్ లో వచ్చిన టైంతోనే వంశీ జనగణమనలో భాగమైనట్టుగా కనిపిస్తోంది. యధావిధిగా ఛార్మీ ఇందులో కూడా పూరి కనెక్ట్స్ తరఫున ప్రధాన నిర్మాతల్లో ఒకరుగా ఉంటారు. బడ్జెట్ ఎంతనే వివరాలు ఇంకా బయటికి రాలేదు.

విజయ్ దేవరకొండకు లైగర్ సక్సెస్ చాలా కీలకం. ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి హిట్ అయితే తర్వాత చేస్తున్న సినిమాలకు మైలేజ్ ప్లస్ బిజినెస్ అమాంతం పెరిగిపోతుంది. ఇది చేస్తున్నప్పుడు పూరి టేకింగ్ నచ్చే జనగణమనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా తెలుస్తోంది. హీరోయిన్ ఎవరు ఇతర టెక్నికల్ టీమ్ తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ఒకప్పుడు మహేష్ బాబుతో తీయాలని పూరి రాసుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. బిజినెస్ మెన్ తర్వాత డిస్కస్ చేసుకున్నారు కూడా. కానీ తర్వాత ఎందుకో కార్యరూపం దాల్చలేకపోయింది. ఇప్పుడా స్థానంలో రౌడీ బాయ్ వచ్చాడు. చూడాలి ఎవరి నిర్ణయం కరెక్టో

Also Read : Yash : సోషల్ మీడియాలో రాఖీ భాయ్ మీద దాడి