ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ.. ఈ ఏడాది సూపర్ స్టార్ రజినీ నటించిన 'జైలర్' సినిమాతో సూపర్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు నటుడు వినాయకన్. జైలర్ లో మెయిన్ విలన్ గా అతడు కనబరిచిన నటన, వేరియేషన్స్ అన్ని కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. దీంతో కోలీవుడ్ కి మరో మంచి విలన్ దొరికేసాడని అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. తాజాగా వినాయకన్ ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం అటు ఇండస్ట్రీ వర్గాలలో, ఇటు సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది.

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ.. ఈ ఏడాది సూపర్ స్టార్ రజినీ నటించిన ‘జైలర్’ సినిమాతో సూపర్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు నటుడు వినాయకన్. జైలర్ లో మెయిన్ విలన్ గా అతడు కనబరిచిన నటన, వేరియేషన్స్ అన్ని కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. దీంతో కోలీవుడ్ కి మరో మంచి విలన్ దొరికేసాడని అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. తాజాగా వినాయకన్ ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం అటు ఇండస్ట్రీ వర్గాలలో, ఇటు సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. మరి వినాయకన్ ని ఎందుకు అరెస్ట్ చేశారు? అతను చేసిన నేరం ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
జైలర్ సినిమా విలన్ గా వినాయకన్ ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో కరుడుగట్టిన విలన్ గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అయితే.. సినిమాలో విలన్ అయిన వినాయకన్.. రియల్ లైఫ్ లో కూడా విలనిజం ప్రదర్శించడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పోలీసుల ముందే మద్యం సేవించి రచ్చ చేయడంతో కేరళలోని నార్త్ ఎర్నాకులం పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. అంతేగాక స్టేషన్ లో కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఎర్నాకులం పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారని సమాచారం.
వినాయకన్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు ఆయనపై ఆరోపణలు చేశారని.. అర్ధరాత్రి పార్టీలు, ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంటాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే పోలీసులు వినాయకన్ కి నోటీసులు జారీ చేసి.. విచారణకు హాజరు కావాలని కోరారు. దీంతో మద్యం సేవించి ఉన్న నటుడు.. స్టేషన్ కి చేరుకొని అక్కడ తాగిన మత్తులో పోలీసులను దుర్భాషలాడుతూ.. దురుసుగా బిహేవ్ చేసినందుకు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వినాయకన్ అరెస్ట్ అయిన విషయంతో పాటు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. చిన్న చిన్న క్యారెక్టర్స్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వినాయకన్.. జైలర్ సినిమాతో ప్రశంసలు అందుకున్నాడు. మరి వినాయకన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.