iDreamPost

జూ. ఎన్టీఆర్ గురించి మెురగడం తగ్గించుకుంటే మంచిది: ఫ్యాన్స్

  • Author Soma Sekhar Updated - 11:57 AM, Fri - 3 November 23

చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అయితే అలాంటి వారికి ఘాటుగా కౌంటర్లు ఇస్తూనే వస్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. అయితే ఈసారి ఏకంగా ఫ్లెక్సీ పెట్టి మరీ టీడీపీ లీడర్స్ కి కౌంటర్ ఇచ్చారు తారక్ ఫ్యాన్స్.

గత కొంత కాలంగా ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం చంద్రబాబు అరెస్ట్. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి రోజులు గడుస్తున్నా గానీ.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అయితే అలాంటి వారికి ఘాటుగా కౌంటర్లు ఇస్తూనే వస్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయిన బాబు విషయంలో అసలు మా హీరో ఎందుకు స్పందించాలని వారు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా మరోసారి ఈ విషయం వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఏపీలోని పల్నాడులో వెలసిన ఫ్లెక్సీనే.

చంద్రబాబు అరెస్ట్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వారందరికి దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. తాజాగా ఈ విషయంపై పల్నాడు లో వెలసిన ఓ ఫ్లెక్సీ వైరల్ గా మారింది. వివరాల్లోవకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా వెల్లూరు లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫ్లెక్సీలో “మనిషి మౌనం వెనక ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఇక ఛాన్స్ దొరికితే చాలు బురద చల్లే వర్గం మీరు. విషయంపై స్పందించమంటారు. స్పందిస్తే.. నోటికొచ్చినట్లు తిడతారు. దయచేసి మీరు జూనియర్ ఎన్టీఆర్ గురించి మెురగడం తగ్గించుకుంటే మంచిది. రాజకీయాల్లోకి మా హీరోని లాగొద్దు” అంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి