iDreamPost
android-app
ios-app

ఆది పురుష్‌కి కూడా అందని రేంజ్‌లో జై హనుమాన్! పది ఇంతల బడ్జెట్‌తో!

ఇతిహాస పురాణాల్లో ఓ సూపర్ హీరో కథను.. ఇప్పటి నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీని చూసి బాలీవుడ్ సైతం నోరెళ్ల బెట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతుంది.

ఇతిహాస పురాణాల్లో ఓ సూపర్ హీరో కథను.. ఇప్పటి నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీని చూసి బాలీవుడ్ సైతం నోరెళ్ల బెట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతుంది.

ఆది పురుష్‌కి కూడా అందని రేంజ్‌లో జై హనుమాన్! పది ఇంతల బడ్జెట్‌తో!

సంక్రాంతి బరిలో సందడి చేసిన మూవీల్లో ఒకటి హనుమాన్. ప్రశాంత్ వర్మ, సజ్జా తేజ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. జనవరి 12న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ జాబితాలోకి చేరింది. చిన్న సినిమా పెద్ద మ్యాజిక్కే చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో బీటౌన్ పండితులకు తెలియజేసింది ఈ సూపర్ హీరో మూవీ. ఇతిహాస గాధలను తెరకెక్కించే విధానం ఇది అని రుజువు చేసింది.  తెలుగులోనే కాదూ.. హిందీలో కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ ఫుల్ అయ్యింది.  కేవలం రూ. 30-40 కోట్ల తెరకెక్కిన హనుమాన్ మూవీ.. వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

జై హనుమాన్ సీక్వెల్ ఉండబోతుందంటూ.. హనుమాన్ మూవీ చివరిలో వెల్లడించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే ఈ సినిమా వేరే లెవల్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈసారి భారీగా ప్లాన్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరగబోతుంది. ఇక ఈ మూవీలో కాస్టింగ్ కూడా భారీ స్థాయిలోనే సెట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారన్న ఆసక్తి నెలకొంది. రాముడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని ప్రశాంత్ కూడా తన మనస్సులో మాట బయట పెట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ కూడా ఆ రేంజ్‌‌లో ఉండబోతుంది. సుమారు రూ. 200 కోట్లతో మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట ప్రశాంత్. ఈ లెక్క ప్రకారం.. హనుమాన్ కన్నా.. పదింతల బడ్జెట్ పెట్టనుంది.

సీసీ వర్క్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ నిమిత్తం భారీగా ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు. అయితే ఈ మూవీ సెట్స్ పై వెళ్లేందుకు ఆలస్యం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2025లో జై హనుమాన్ రిలీజ్ చేస్తానని ప్రకటించినప్పటికీ.. ఇది మరింత లేట్ అయ్యేటట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రశాంత్ ఎప్పుడో అధీరా అనే మూవీ ఎనౌన్సే చేయడంతో పాటు.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి ఈ మూవీతో హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఇతి హాస గాధల్లోని స్పెషల్ క్యారెక్టర్లను తీసుకుని.. ఇప్పటి తరానికి నచ్చే విధంగా అందిస్తున్నాడు ప్రశాంత్. అలాగే మహాకాళి అనే మూవీ కూడా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకే జై హనుమాన్ షురూ చేయనున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి