iDreamPost
android-app
ios-app

జై చిరంజీవి చిన్నారి.. ఇప్పుడు మెగాస్టార్ గర్వించే ఉద్యోగం సాధించి!

  • Published Mar 19, 2024 | 5:31 PM Updated Updated Mar 19, 2024 | 5:31 PM

చాలా మంది సెలెబ్రిటీలు చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యి.. కొన్ని సినిమాలతోనే ఆగిపోతుంటారు. కానీ. వారు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో ఉన్నత స్థాయిలో రాణిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఈ కోవకు చెందిన వారే.

చాలా మంది సెలెబ్రిటీలు చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యి.. కొన్ని సినిమాలతోనే ఆగిపోతుంటారు. కానీ. వారు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో ఉన్నత స్థాయిలో రాణిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఈ కోవకు చెందిన వారే.

  • Published Mar 19, 2024 | 5:31 PMUpdated Mar 19, 2024 | 5:31 PM
జై చిరంజీవి చిన్నారి.. ఇప్పుడు మెగాస్టార్ గర్వించే ఉద్యోగం సాధించి!

సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి నటించి.. ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించి.. కనుమరుగైపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో అడపా దడపా వారి వారి సోషల్ మీడియా ఖాతాలలో సందడి చేసేవారు కూడ ఉన్నారు. ఇక మరికొందరైతే సినిమాలకు దూరం అయిన తర్వాత పూర్తిగా కనుమరుగైపోతారు. అయితే, కేవలం సినిమాలకు దూరం అయినంత మాత్రాన వ్యక్తిగత జీవితంలోను .. వెనుకబడ్డారు అని అనుకుంటే పొరపాటే. కొంతమంది నటులు సినిమాలకు దూరం అయినా కూడా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో ఉన్న స్థాయిలో రాణిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా.. సినిమాలకైతే ప్రస్తుతం దూరమైంది కానీ.. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అడ్వకేట్ గా తన భాద్యతలు నిర్వర్తిస్తోంది. ఆమె మరెవరో కాదు..

జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి మేనకోడలిగా నటించిన శ్రీయా శర్మ. ఆ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయింది ఈ అమ్మడు. జై చిరంజీవ చిత్రంతో ఈ బ్యూటీకి అవకాశలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ సినిమా తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలాలో నటించింది శ్రీయా. వాటిలో “చిల్లర్ పార్టీ” సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఆ తర్వాత టీనేజ్ క్యారెక్టర్స్ గా .. దూకుడు సినిమాలో సమంత చెల్లిగా, రచ్చ, తూనీగ తూనీగ , ఏటో వెళ్ళిపోయింది మనసు చిత్రాలలో నటించి.. ప్రేక్షకులను అలరించింది ఈ అమ్మడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. క్యూట్ క్యారెక్టర్స్ చేస్తూ .. అందరిని మెప్పించింది.

Jai Chiranjeeva Kid

ఇక ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సినిమాలో హీరోయిన్ గా ఎదిగింది ఈ అమ్మడు. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా హీరోగా నటించిన గాయకుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఆ తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ లో కూడా హీరోయిన్ గా నటించి.. మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు 26 ఏళ్ళు. ఇక ఆ సినిమా తర్వాత శ్రీయా ఎక్కడ కనిపించలేదు. కానీ, కొన్ని కొన్ని ప్రకటనలలో కనిపించేది. ఇక ఇప్పుడు శ్రీయ శర్మ న్యాయ విద్యను పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అడ్వకేట్ గా వర్క్ చేస్తోంది. మరి, చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. లాయర్ గా స్థిరపడిన శ్రీయా శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Sharma (@shriyasharma9)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş