iDreamPost
android-app
ios-app

ఆ ఇద్దరు భారత క్రికెటర్లు అంటే చాలా ఇష్టం.. ‘దేవర’ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Feb 23, 2024 | 9:12 AM Updated Updated Feb 23, 2024 | 9:12 AM

‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ తనకు ఇద్దరు భారత క్రికెటర్లు అంటే చాలా ఇష్టమని అంటున్నారు. ఆమెకు నచ్చిన ఆ ప్లేయర్లు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ తనకు ఇద్దరు భారత క్రికెటర్లు అంటే చాలా ఇష్టమని అంటున్నారు. ఆమెకు నచ్చిన ఆ ప్లేయర్లు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 23, 2024 | 9:12 AMUpdated Feb 23, 2024 | 9:12 AM
ఆ ఇద్దరు భారత క్రికెటర్లు అంటే చాలా ఇష్టం.. ‘దేవర’ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్​లో చాలా బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో ఆమె యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్​లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీతో పాటు ‘మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి’, ‘ఉలఝ్’ అనే రెండు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నారు జాన్వీ. టాలీవుడ్​తో పాటు కోలీవుడ్​ నుంచి కూడా ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. టాప్ హీరోస్​ మూవీస్​లో యాక్ట్ చేయాల్సిందిగా జాన్వీని కాంటాక్ట్ అవుతున్నారని టాక్. సూర్యతో పాటు మెగా పవర్ స్టార్‌‌ రామ్ చరణ్ సినిమాకూ ఆమె ఓకే అయినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు జాన్వీ. టీమిండియాలోని ఆ ఇద్దరు స్టార్లు తన ఫేవరెట్ అన్నారు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ అంటే తనకు చాలా ఇష్టమని జాన్వీ కపూర్ అన్నారు. వరల్డ్ క్రికెట్​లో వీళ్లిద్దరే తన ఫేవరెట్ ప్లేయర్స్ అని చెప్పారు. సాధారణంగా కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని.. కార్తీక్ విషయంలో మాత్రం ఆయనతో కలసి పని చేయడంతో ఫ్యాన్ అయిపోయానని తెలిపారు. కార్తీక్ చాలా కష్టపడతారని.. ఆయన లవ్లీ పర్సన్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు జాన్వీ. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిస్టర్ అండ్ మిస్సెస్ మాహీ’ మూవీలో జాన్వీ యాక్ట్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ కోసం ఆమె క్రికెట్ నేర్చుకుంటున్నారు. బ్యాటింగ్ ఎలా చేయాలో జాన్వీకి నేర్పిస్తున్నారు దినేష్ కార్తీక్. అందుకే ఆయనతో కలసి పని చేయడం బాగుందని.. కార్తీక్ హార్డ్ వర్కర్ అని మెచ్చుకున్నారామె.

ఇక, ‘దేవర’ తర్వాత సౌత్​లో జాన్వీ నటించబోయే నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. సూర్య సరసన యాక్ట్ చేసే ఛాన్స్​ను ఆమె కొట్టేశారని.. అలాగే రామ్ చరణ్-బుచ్చిబాబు సానా కాంబినేషన్​లో వస్తున్న ‘ఆర్సీ 16’లోనూ జాన్వీనే హీరోయిన్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా ఈ న్యూస్ నిజమేనంటూ కామెంట్ చేయడంతో రెండు క్రేజీ ప్రాజెక్టులకు జాన్వీ ఓకే అయ్యారని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె ట్విస్ట్ ఇచ్చారు. ‘దేవర’తో పాటు రెండు హిందీ సినిమాలు చేస్తున్నానని.. సౌత్​లో కొత్తగా ఏ ప్రాజెక్ట్​ కూడా ఒప్పుకోలేదని క్లారిటీ ఇచ్చారు. నాన్న తనను సంప్రదించకుండానే తదుపరి మూవీస్ ప్రకటించారని.. కానీ వాటి గురించి ఇప్పుడే చెప్పలేనన్నారు. దీంతో అసలు సూర్య, చరణ్ మూవీస్​ను జాన్వీ చేస్తారా? లేదా? అని ఆడియెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. కోహ్లీ, కార్తీక్ అంటే ఇష్టమంటూ జాన్వీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Movie: OTTలోకి గుంటూరు కారం భామ సినిమా..ఎక్కడంటే!

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet