iDreamPost
android-app
ios-app

నా బాయ్​ ఫ్రెండ్​తో రిలేషన్ ముగియడానికి అదే కారణం: జాన్వీ

  • Author singhj Published - 05:59 PM, Mon - 28 August 23
  • Author singhj Published - 05:59 PM, Mon - 28 August 23
నా బాయ్​ ఫ్రెండ్​తో రిలేషన్ ముగియడానికి అదే కారణం: జాన్వీ

సినీ పరిశ్రమలో వారసత్వం ద్వారా వెండితెరకు పరిచయమైన వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ అలాంటి వారిలో ఏ కొద్దిమందో మాత్రమే ఎక్కువ కాలం కంటిన్యూ అవుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయంతో పాటు కాస్త లక్ కూడా కలసిరావాలి. అలాగే వచ్చిన ఛాన్సులను సరిగ్గా వినియోగించుకోవాలి. సినిమా, సినిమాకు మరింత మెరుగవుతూ పోవాలి. ఇలా వారసత్వంతో వచ్చిన​ అవకాశాలను అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో సెటిలైన స్టార్లలో ఒకరు జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ వెండితెరకు పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మతిపోగొట్టే గ్లామర్​తో పాటు అద్భుతమైన యాక్టింగ్​తో ఆడియెన్స్ మనసులను దోచుకుంటున్నారు జాన్వీ. ఇటీవల ‘బవాల్’ అనే హిందీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారామె. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆనందంలో ఉన్న జాన్వీ.. ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన చేస్తున్న ‘దేవర’పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. సౌత్​లో ఆమెకు ఇదే తొలి సినిమా కానుంది. ఇక, తాజాగా ఒక టాక్​ షోలో పాల్గొన్న జాన్వీ.. తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్​తో బంధాన్ని ఎందుకు ముగించాల్సి వచ్చిందో తెలిపారు.

తాను, తన మొదటి బాయ్ ఫ్రెండ్ సీక్రెట్​గా కలుసుకునే వాళ్లమని జాన్వీ అన్నారు. తామిద్దరం ఒకరికతో ఒకరం చాలా అబద్ధాలు చెప్పుకొనే వాళ్లమని తెలిపారు. అయితే తాను చెప్పిన ఓ అబద్ధం కారణంగానే ఆ రిలేషన్ ముగిసిందని రివీల్ చేశారు జాన్వీ. అలాగే తనకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదని తన పేరెంట్స్ కూడా చెప్పారని ఆమె తెలిపారు. తల్లిదండ్రులతో నిజాయితీగా ఉంటే అన్నీ సులభంగా మారతాయని అర్థం చేసుకున్నానని జాన్వీ పేర్కొన్నారు. పేరెంట్స్ నిర్ణయాలకు అనుగుణంగా వెళ్తే ఫ్యూచర్ బాగుంటుందనేది తన అభిప్రాయమని వివరించారు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో మాత్రం జాన్వీ కపూర్ చెప్పలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి