iDreamPost
android-app
ios-app

వాడు నా కాలిగోటికి సరిపోడు! జబర్దస్త్ రోహిణి షాకింగ్ కామెంట్స్!

  • Author ajaykrishna Published - 09:48 AM, Sat - 26 August 23
  • Author ajaykrishna Published - 09:48 AM, Sat - 26 August 23
వాడు నా కాలిగోటికి సరిపోడు! జబర్దస్త్ రోహిణి షాకింగ్ కామెంట్స్!

సెలబ్రిటీలైనా.. సామాన్యులైనా.. ప్రతీ ఒక్కరి లైఫ్ లో స్పెషల్ పర్సన్స్ ఉంటారు. అది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బెస్టీ లేదా లవర్ ఇలా ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళు లైఫ్ లో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో.. అదే మనుషులు లైఫ్ లో నుండి వెళ్ళిపోతే అంత బాధను అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినప్పుడు చాలా బాధపడి పోతుంటారు. ఈ విషయంలో తానేమి మినహాయింపు కాదని అంటోంది బుల్లితెర నటి, జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీరియల్ నటిగా జర్నీ స్టార్ట్ చేసిన రోహిణి.. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ కమెడియన్ గా ఎదిగింది.

ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ తో పాటు అవకాశాలు వచ్చిన సినిమాలలో నటిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమాలలో కూడా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య ఓ ప్రమాదం కారణంగా కొన్నాళ్ళు షోలు, సినిమాలకు దూరమైన రోహిణి.. ఈ మధ్యే మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. అయితే.. రీసెంట్ గా ఓ షోలో భాగంగా తన ఫస్ట్ లవ్, బ్రేకప్ గురించి పెదవి విప్పింది. ఏంటి.. రోహిణి లైఫ్ లో కూడా బ్రేకప్ పెయిన్ ఉందా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే రోహిణి.. లైఫ్ లో, కెరీర్ లో అన్నిరకాల కష్టాలు చూసి వచ్చానని ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో తెలిపిన సంగతి తెలిసిందే.

ఇక రోహిణి తన ఫస్ట్ లవ్, బాయ్ ఫ్రెండ్, బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కానీ.. కొన్నాళ్ళకే అతనితో బ్రేకప్ అయ్యింది. బ్రేకప్ తర్వాత చాలా నరకం చూశాను. ఆ టైమ్ లో నాకు ఫ్రెండ్స్ మాత్రమే సపోర్ట్ గా నిలిచారు. అసలు వాడెవడు.. నీ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ ధైర్యం చెబుతుండేవారు. ఆ తర్వాత నాకు కూడా అదే నిజం అనిపించింది.. వాడెవడు ఆఫ్ట్రాల్ గాడు.. వాడి గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని అప్పుడే డిసైడ్ అయ్యాను. నా ఫ్రెండ్స్ వల్లనే నేనిప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రోహిణి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ.. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరా? అనేది మాత్రం రివీల్ చేయకపోవడంతో ఫ్యాన్స్, నెటిజన్స్ తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి రోహిణి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler