iDreamPost
android-app
ios-app

చిత్రపరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • Author ajaykrishna Published - 09:30 AM, Sat - 26 August 23
  • Author ajaykrishna Published - 09:30 AM, Sat - 26 August 23
చిత్రపరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటుడు కన్నుమూత!

చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీరియల్, సినీ నటుడు మిలింద్ సఫయ్.. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు. కాగా.. శుక్రవారం ఉదయం 10 గంటల 45 నిముషాల ప్రాంతంలో మిలింద్ కన్నుమూసినట్లు సమాచారం. ఇక మిలింద్ మరణంతో మరాఠీ ఇండస్ట్రీలో.. ప్రేక్షకులలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే.. మిలింద్ మరణ వార్తను నటుడు జయవంత్ వాడ్కర్.. సోషల్ మీడియా వేదికగా విషయాన్నీ తెలియజేస్తూ.. సంతాపం వ్యక్తం చేశారు. దీంతో మిలింద్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.

ఇక సీరియల్స్ తో పాటు సినీ నటుడుగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మిలింద్.. ‘ఆయ్ కుతే కే కర్తే’ అనే సీరియ‌ల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు రావడంతో ఆ వైపు అడుగులు వేశారు. సినిమాల పరంగా.. మిలింద్ సఫయ్ మేకప్, థాంక్ యు విఠలా, పోస్టర్ బాయ్స్, చడీ లగే చమ్ చమ్, ప్రేమచి గోష్టా, టార్గెట్, బి పాజిటివ్’ లాంటి సూపర్ హట్ సినిమాలలో నటించారు. ఇదిలా ఉండగా.. మిలింద్ మరణవార్తకు ముందురోజే మరాఠీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సీమా డియో కన్నుమూశారు. ఇలా ఒకరి వెనుక మరొకరు మరాఠీ ఇండస్ట్రీలో మరణించడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Jojobet Girişjojobetjojobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş