iDreamPost
android-app
ios-app

అవకాశాల కోసం వెళ్లి.. కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశా: జబర్దస్త్ రోహిణి

  • Author ajaykrishna Published - 10:45 AM, Mon - 31 July 23
  • Author ajaykrishna Published - 10:45 AM, Mon - 31 July 23
అవకాశాల కోసం వెళ్లి.. కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశా: జబర్దస్త్ రోహిణి

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎన్నో ఏళ్లుగా సాగిన సంగతి తెలిసిందే. ఈ కాస్టింగ్ కౌచ్ కారణంగా ఎంతోమంది హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు అవస్థలు పడ్డారు. కెరీర్ సైతం పోగొట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. అవకాశం ఇస్తామని చెప్పి.. ఛాన్స్ కోసం ఆశతో వచ్చిన అమ్మాయిలను, ఆర్టిస్ట్ లను కమిట్మెంట్ పేరుతో మోసం చేశారని ఓవైపు వాదనలు జరుగుతున్నాయి. అయితే.. కాస్టింగ్ కౌచ్ కి ఇండస్ట్రీల మధ్య బేధం లేదు. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో ఇది కొన్నాళ్ళ ముందు వరకు సాగుతూ వచ్చింది. ఎప్పుడైతే హాలీవుడ్ నుండి మీటూ అనే ఉద్యమం మొదలైందో.. మెల్లగా ఒక్కొక్కరు నోరు తెరచి మాట్లాడటం మొదలుపెట్టారు.

ఇప్పటిదాకా ఎంతోమంది హీరోయిన్స్, ఆర్టిస్టులు తాము ఫేస్ చేసిన చేదు అనుభవాలు షేర్ చేసుకొని.. కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నవారి కళ్లు తెరిపించారు. ఓవైపు ఈ మీటూ ఉద్యమం సాగుతున్నప్పటికి.. మరోవైపు సైలెంట్ గా ఎక్కడో చోట ఈ కమిట్మెంట్ ఇష్యూస్ జరుగతూనే ఉన్నాయి. అయితే.. తాను కూడా కెరీర్ ప్రారంభంలో ఈ కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ లను ఫేస్ చేశానని అంటోంది జబర్దస్త్ లేడీ కమెడియన్, నటి రోహిణి. జబర్దస్త్ కమెడియన్ గా రోహిణి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఎపిసోడ్స్ కష్టపడి కామెడీ పండించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు తానే స్వయంగా ఓ టీమ్ కి లీడర్ గా ఎదిగింది.

ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం తిరుగుతూ తాను కూడా కాస్టింగ్ కౌచ్ సందర్భాలు ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రోహిణి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఛాన్సుల కోసం వెళ్తే, కమిట్ అవుతావా? అని అడిగారు. దీంతో అక్కడ రిజెక్ట్ చేసి వచ్చేశాను. ఆ తర్వాత మరో ఆడిషన్ కి వెళ్తే.. అక్కడ నా తండ్రి వయసున్న వ్యక్తి నీకు ఛాన్స్ ఇస్తే నాకేంటి? అన్నాడు. వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పేసి బయటికి వచ్చేసా.. అవకాశం కోసం అంత దిగజారే స్థితిలో లేనని స్ట్రాంగ్ గా చెప్పేశా. కానీ.. నేనెప్పుడూ అలాంటి తప్పుడు దారిలో వెళ్ళలేదు. నా టాలెంట్ చూసి వచ్చిన అవకాశాలతో ఈ స్థాయికి వచ్చాను.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రోహిణి జబర్దస్త్ కమెడియన్ గానే కాకుండా సీరియల్స్, సినిమాలలో నటిస్తూ బిజీ అవుతోంది. మరి రోహిణి గురించి, కాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet