జబర్దస్త్, సీరియల్ నటి రీతూ చౌదరిని ఓ వ్యక్తి ఆర్థికంగా మోసం చేసాడట. అదికూడా ఏకంగా లక్షలలో.. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మరి అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
జబర్దస్త్, సీరియల్ నటి రీతూ చౌదరిని ఓ వ్యక్తి ఆర్థికంగా మోసం చేసాడట. అదికూడా ఏకంగా లక్షలలో.. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మరి అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన బుల్లితెర నటి రీతూ చౌదరి. ఈ బ్యూటీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూనే.. మరోవైపు టీవీ సీరియల్స్ లో నటిగా రాణిస్తుంది. వీటన్నింటికి మించి రీతూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. ఎవరికి అంత ఈజీగా సెట్ అయ్యే మార్గాలు దొరకవు. కానీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిరంతరం కష్టపడితే తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. ప్రస్తుతం రీతూ చౌదరి కూడా అదే బాటలో వెళ్తోంది. ఇటీవల తన తండ్రిని కోల్పోయిన రీతూ.. ఏమాత్రం కుంగిపోకుండా తన పని తాను చేసుకుంటోంది.
తన తండ్రి లేని లోటు తెలియకుండా ఫ్యామిలీని దగ్గరుండి చూసుకుంటుంది. అయితే.. ఎప్పటినుండో తాను హైదరాబాద్ లో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని తాపత్రయపడుతోంది. మొత్తానికి కొత్త ఇల్లు సాధించి.. దాని ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటుంది. ఈ క్రమంలో తాను ఓ ఇంటీరియర్ డిజైనర్ వల్ల ఆర్థికంగా.. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతోంది రీతూ. తాజాగా తన కొత్త ఇంటి నిర్మాణం.. అందులో జరుగుతున్న ఇంటీరియర్ వర్క్ కి సంబంధించి ఓ వీడియో షూట్ చేసింది. ఆ వీడియోలో భాగంగా.. తాను మొదటగా ఇంటీరియర్ వర్క్ వేరే వ్యక్తికి ఇచ్చానని, అతను డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టాడని.. ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా వర్క్ చేయలేదని చెప్పింది.
మొదటగా ఇంటీరియర్ అప్పగించిన వ్యక్తి.. మానసికంగా ఆందోళనకు గురి చేయడమే కాకుండా.. దాదాపు రూ. 2 లక్షల వరకు అతని వల్ల మోసపోయానని తెలిపింది. రీతూ మాట్లాడుతూ.. “మా నాన్న దూరం కావడంతో కొత్త ఇల్లు ఇంటీరియర్ వర్క్ ఓ వ్యక్తికి అప్పగించాను. అందుకుగాను అతనికి సుమారు రూ. 5 లక్షలు ఇచ్చాను. డబ్బు తీసుకున్నాక వర్క్ చేయలేదు. దాంతో అతన్ని వద్దని చెప్పి డబ్బులు రిటర్న్ అడిగాను. కానీ.. అతను ఉల్టా మమ్మల్ని మాటలు అనేవాడు. మేం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో రూ. 3 లక్షలు తిరిగి ఇచ్చాడు. ఓవైపు ఈఎంఐ లు కడుతూ.. మా నాన్న లేక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను. అతని వల్ల ఆర్థికంగా మోసపోయి ఏడ్చాను. ప్రస్తుతం నా ఇంటీరియర్ వర్క్ వేరే వాళ్లకు అప్పగించాను. వాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వర్క్ చేస్తున్నారు.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రీతూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రీతూ చౌదరి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.