iDreamPost
android-app
ios-app

ఎర్ర చందనం కేసులో జబర్దస్త్ కమెడియన్.. అసలు నిందితుడు ఎవరంటే..?

  • Author Dharani Published - 12:32 PM, Tue - 13 June 23
  • Author Dharani Published - 12:32 PM, Tue - 13 June 23
ఎర్ర చందనం కేసులో జబర్దస్త్ కమెడియన్.. అసలు నిందితుడు ఎవరంటే..?

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జబర్దస్త్ కమెడియన్ పేరు వేలుగులోకి రావడం సంచలనంగా మారింది. జబర్దస్త్ లో లేడీ గేటప్ ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్ హరి పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. లేడీ గేటప్ ద్వారా పాపులర్ అయిన హరి తాజాగా ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్నాడంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల క్రితం పుంగ‌నూరులో పోలీసులు రూ.60 ల‌క్ష‌లు విలువైన ఎర్ర చంద‌నంను సీజ్ చేశారు. ఆదివారం రాత్రి ప‌ద‌కొండు గంట‌ల‌కు పుంగ‌నూరు పోలీసులకు ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ గురించి స‌మాచారం అందింది. ఈ క్రమంలో వారు త‌నిఖీలు చేస్తుండ‌గా 60 లక్షల విలువైన ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ అక్ర‌మ త‌ర‌లింపు కేసులో జబర్దస్త్ కమెడియన్ హ‌రి క్రిష్ణ పట్టుబడ్డాడంటూ వార్తలు వచ్చాయి.

కానీ వాస్తవంగా ఈ కేసులో పట్టుబడింది హరి క్రిష్ణ కాదని తెలిసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎర్ర చందనం కేసు లో పట్టుబడింది వై ఎస్ హరి బాబు అని తెలిపాడు. గతం లో కూడా తన మీద ఇలానే తప్పుడు వార్తలు వచ్చాయని.. ఇప్పుడు కూడా తనపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని స్పష్టం చేసాడు. ఈ కేసు లో పట్టుబడింది వై ఎస్ హరి బాబు అని.. కానీ తన పూర్తీ పేరు గంప హరి క్రిష్ణ అని స్పష్టం చేశాడు.

ఈ కేసు లో పట్టుబడ్డ హరి బాబు జబర్దస్త్ లో కనిపించడం వల్ల .. జబర్దస్త్ హరి అనగానే తనే అనుకుని.. పూర్తీ వివరాలు తెలుసుకోకుండా తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. తన ఫోటోలు పబ్లిష్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. పూర్తీ సమాచారం తెలుసుకుని వార్తలు రాయాలని.. తన గురించి తప్పుడు వార్తలు రాసిన చానెల్స్ తనకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే సదరు ఛానెల్స్ మీద లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇక ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రధాన నిందితుడిగా ఉన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ హరి బాబు కోసం పోలీస్ లు గాలింపు చర్యలు చేపట్టారు. జబర్దస్త్ కమెడియన్ హరిపై తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసుల వద్ద రెండు కేసుల్లో నిందితుడిగా ఉండగా, కాణిపాకం పోలీసు స్టేషను పరిధిలో ఒక్క‌ కేసు, ఏర్పేడు పోలీసు స్టేషను పరిధిలో ఒక్క కేసులో నిందుతుడిగా ఉన్నట్లు పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి వెల్లడించారు..