iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ‘టైగర్ నాగేశ్వరరావు’ నిర్మాణ సంస్థపై IT దాడులు!

  • Author ajaykrishna Published - 12:43 PM, Wed - 11 October 23
  • Author ajaykrishna Published - 12:43 PM, Wed - 11 October 23
బ్రేకింగ్: ‘టైగర్ నాగేశ్వరరావు’ నిర్మాణ సంస్థపై IT దాడులు!

మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరొందిన స్టూవర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితంలోని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాని రూపొందించారు. దర్శకుడు ఆకెళ్ళ వంశీ తెరకెక్కించిన ఈ సినిమాని.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ బిగ్ బడ్జెట్ తో నిర్మించారు. దసరా ఫెస్టివల్ సందర్బంగా సినిమా అక్టోబర్ 20న రాబోతుంది. రవితేజ కెరీర్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. కాగా.. ప్రస్తుతం రవితేజ, మూవీ టీమ్ అంతా టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

ఇక ఓవైపు సినిమా రిలీజ్ కి ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్.. ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అయితే.. ఓవైపు రిలీజ్ హడావిడి నడుస్తుండగా.. సడన్ గా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ పై ఐటీ శాఖ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. గతేడాది ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు అభిషేక్. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో మరోసారి తన లక్ పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తీరా రిలీజ్ టైమ్ లో ఇలా ఐటీ శాఖ దాడులు నిర్వహించడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. మరి ఏం జరిగింది? ఏం జరగనుంది? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ గా మారింది.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş