iDreamPost
android-app
ios-app

ఈ పాప ఇండస్ట్రీలోకి వచ్చి చాన్నాళ్లయ్యింది.. ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతోంది.. ఎవరో గుర్తు పట్టారా..?

ఇండస్ట్రీలో హీరోయిన్లకు నటన పరంగా లైఫ్ లైన్ చాలా తక్కువ. వచ్చిన ఛాన్సులు అందిపుచ్చుకుంటూ.. తమను తాము నిరూపించుకునేందుకు కష్టపడుతుంటారు. ఆమె నటించిన సినిమాలు ఫెయిల్ అయితాయో.. మెల్లిగా కెరీర్ ఖతం అయిపోవాల్సిందే. కానీ ఈ ఫోటోలోని హీరోయిన్ అందుకు మినహాయింపు

ఇండస్ట్రీలో హీరోయిన్లకు నటన పరంగా లైఫ్ లైన్ చాలా తక్కువ. వచ్చిన ఛాన్సులు అందిపుచ్చుకుంటూ.. తమను తాము నిరూపించుకునేందుకు కష్టపడుతుంటారు. ఆమె నటించిన సినిమాలు ఫెయిల్ అయితాయో.. మెల్లిగా కెరీర్ ఖతం అయిపోవాల్సిందే. కానీ ఈ ఫోటోలోని హీరోయిన్ అందుకు మినహాయింపు

ఈ పాప ఇండస్ట్రీలోకి వచ్చి చాన్నాళ్లయ్యింది.. ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతోంది.. ఎవరో గుర్తు పట్టారా..?

సినిమా రంగుల ప్రపంచంలో కృషితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా హీరోయిన్లకు. లేకుంటే ఒక్క సినిమాతోనే తిరుగు టపా కట్టాల్సిందే. ఆ జాబితా చాలా పెద్దదే. అలాగే ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన వారున్నారు.  ఆ తర్వాత కూడా కెరీర్ కొనసాగించే విషయంలో ఆచి తూచి కథలు ఎంపిక చేసుకోవాలి. లేకుంటే గాడి తప్పే ప్రమాదం ఉంది. గ్లామర్ మెయిన్ టైన్ చేస్తూ.. మంచి కథలను ఎంపిక చేసుకుని హిట్స్ అందుకోగలిగితే.. ఐదేళ్లు, పదేళ్లు ఏంటీ..కావాలంటే రెండు దశాబ్దాల పాటు హీరోయిన్‌గా కొనసాగొచ్చు. అలనాటి తారామణులకు అలాంటి అవకాశాలు ఉంటాయి.. ఇప్పుటి హీరోయిన్లకు అన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో అది కూడా హీరోయిన్ గా కంటిన్యుటి సాధ్యమా అంటే.. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న చిన్నారే అందుకు ఉదాహరణ.

మహిళ ఎత్తుకున్న ఈ పాప ఇప్పుడో స్టార్ హీరోయిన్. ఎప్పుడో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మడిలో ఇసుమంతైనా అందం తగ్గలేదు. పెద్ద బ్యానర్‌లోనే తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ.. సుమారు 20 ఏళ్లకు పైగా నటిగా అందులోనూ హీరోయిన్‌గా కొనసాగడం అంటే మామూలు మాటలు కాదూ. ఇది ఆమెకు మాత్రమే సాధ్యం. టాలీవుడ్ టాప్ హీరోలందరితో ఆడిపాడిన ఈ భామ.. అటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేసి.. బాలీవుడ్‌లో కూడా సత్తా చాటింది. ఇంతకు ఆమె ఎవరు అంటే..శ్రియా శరణ్. రామోజీ బ్యానర్.. ఉషా కిరణ్ మూవీస్ లో ఇష్టం అనే చిత్రాన్ని చేసింది. దీనికి విక్రమ్ కే కుమార్ దర్శకుడు. ఆ తర్వాత వెంటనే నాగార్జున సరసన సంతోషం సినిమాలో నటించింది. అక్కడి నుండి ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ చేసుకుంది.

did you find this heroine

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రవితేజ వంటి సీనియర్ స్టార్లతోనే కాదూ.. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, తరుణ్ వంటి యంగ్ స్టార్స్ పక్కన ఆడిపాడింది. ఇటు తెలుగే కాదూ.. తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా స్టార్లతో నటించింది. ఈ అరుదైన ఘనత బహుశా ఆమెకు దక్కింది. ఇప్పటికీ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే ఉంది.పెళ్లై, పాప ఉన్న కూడా.. ఆమెలో ఆ బ్యూటీనెస్ తగ్గలేదు. రోజు రోజుకు ఆమె వయస్సు తగ్గుతుందేమో కానీ.. పెరగడం లేదు. మరీ ఏ అమృతమో తాగిందేమో ఆమెకే తెలియాలి. ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలు చేస్తూ పెళ్లి తర్వాత కూడా బిజీ నటిగా మారిపోయింది. శ్రియ సినిమాల్లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/