iDreamPost
android-app
ios-app

రాజమౌళి – మహేశ్ మూవీలో విక్రమ్! సస్పెన్స్ లో పెట్టి వదిలాడు!

  • Published Aug 05, 2024 | 1:26 PM Updated Updated Aug 05, 2024 | 2:00 PM

SSMB 29లో చియాన్ విక్రమ్ నటిస్తున్నాడట. ఈ విషయం గురించి విక్రమ్ ను డైరెక్ట్ గా అడిగితే.. సస్పెన్స్ లో పెట్టి వదిలాడు. ఇంతకీ విక్రమ్ ఏమన్నాడంటే?

SSMB 29లో చియాన్ విక్రమ్ నటిస్తున్నాడట. ఈ విషయం గురించి విక్రమ్ ను డైరెక్ట్ గా అడిగితే.. సస్పెన్స్ లో పెట్టి వదిలాడు. ఇంతకీ విక్రమ్ ఏమన్నాడంటే?

  • Published Aug 05, 2024 | 1:26 PMUpdated Aug 05, 2024 | 2:00 PM
రాజమౌళి – మహేశ్ మూవీలో విక్రమ్! సస్పెన్స్ లో పెట్టి వదిలాడు!

SSMB 29.. సూపర్ స్టార్ మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న మూవీ. యాక్షన్ అండ్ అడ్వెంచరస్ మూవీగా హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మహేశ్-జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ నటులను బరిలోకి దింపబోతున్నట్లు వార్తలు కూడా వైరల్ అవుతున్న విషయం తెలియనిది కాదు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే? SSMB 29లో చియాన్ విక్రమ్ నటిస్తున్నాడట. ఈ విషయం గురించి విక్రమ్ ను డైరెక్ట్ గా అడిగితే.. తన సమాధానంతో అభిమానులను సస్పెన్స్ లో పెట్టాడు. ఇంతకీ విక్రమ్ ఏమన్నాడంటే?

‘తంగలాన్’.. పా. రంజిత్-చియాన్ విక్రమ్ కాంబినేషన్ ప్రయోగాత్మకంగా రూపొందిన చిత్రం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దాంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. అందులో భాగంగా.. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చియాన్ విక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అందులో ఒకటి మహేశ్-రాజమౌళి మూవీలో విక్రమ్ నటిస్తున్నాడన్న క్రేజీ న్యూస్ కూడా ఉంది. మహేశ్ బాబు సినిమాలో నటించే విషయం గురించి రాజమౌళి మిమ్మల్ని సంప్రదించారా? అన్న ప్రశ్నకు విక్రమ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

“రాజమౌళి చాలా మంచి వ్యక్తి. మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. భవిష్యత్ లో కలిసి సినిమా కూడా చేయాలనుకున్నాం. అయితే ప్రత్యేకించి ఒక సినిమా గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు విక్రమ్. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ప్రత్యేకించి ఓ సినిమా గురించి మాట్లాడుకోలేదు అంటూనే.. మహేశ్-జక్కన్న మూవీలో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ మాత్రం చెప్పలేదు ఈ స్టార్ హీరో. దాంతో ఇన్ డైరెక్ట్ గా ఈ సినిమాలో ఉన్నానని చెప్పాడా? లేడని హింట్ ఇచ్చాడా? అంటూ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇక మరికొందరు మాత్రం లైట్ గా లీకిచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే SSMB 29  మూవీలో విక్రమ్ నటిస్తే.. ఓ రేంజ్ లో ఉంటుందని సగటు సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా. రంజిత్ ప్రతిష్టాత్మంగా తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, విక్రమ్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి మహేశ్-రాజమౌళి మూవీలో విక్రమ్ నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio