iDreamPost
android-app
ios-app

Chandu Sai: అదే రుజువైతే ఉరిశిక్ష వాళ్లు వేయక్కర్లేదు.. నేనే వేసుకుంటా: చందూ సాయి

ప్రముఖ యూట్యూబర్ చందూసాయి అరెస్టైన విషయం తెలిసిందే. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి తనపై వచ్చి ఆరోపణలపై స్పందించాడు.

ప్రముఖ యూట్యూబర్ చందూసాయి అరెస్టైన విషయం తెలిసిందే. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి తనపై వచ్చి ఆరోపణలపై స్పందించాడు.

Chandu Sai: అదే రుజువైతే ఉరిశిక్ష వాళ్లు వేయక్కర్లేదు.. నేనే వేసుకుంటా: చందూ సాయి

చంద్రశేఖర్ సాయి కిరణ్ అలియాస్ చందూ సాయి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కింటి కుర్రాడిగా చందూసాయి బాగా ఫేమస్. ఈ యూట్యూబర్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఎన్నో మంచి వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. చందూసాయి చేసే వెబ్ సిరీస్ లు ఎంతో సందేశాత్మకంగా, ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. అందుకే అతనికి ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ కూడా అంత బాగా ఏర్పడింది. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పుడు అతనిపై పెద్ద నిందే పడింది. ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశారంటూ.. అరెస్ట్ కూడా చేశారు. తొలిసారి తన అరెస్టుపై చందూసాయి స్పందించాడు.

చందూసాయికి ఉన్న ఇమేజ్ కి అతనిపై కేసు నమోదు, అరెస్టు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అతనిపై  చీటింగ్, అత్యాచారం కేసు నమోదైందని తెలియడంతో అంతా నివ్వెరపోయారు. పైగా తల్లిదండ్రులు, మరో ఇద్దరిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడంతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. చందూసాయి ఇంతటి మోసం చేశాడా? ఇలాంటి వాడా? అంటూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. అనేక కథనాలు కూడా వచ్చాయి. అఘాయిత్యం, మోసం అంటూ వార్తలు కూడా వచ్చాయి. వీటన్నింటిపై చందూ సాయి తొలిసారి స్పందించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏంటి? కుటుంబం ఎలా ఉంది? అసలు అతను తప్పు చేశాడా? లేదా? అనే వివిధ రకాల ప్రశ్నలకు అడ్వకేట్ కల్యాణ్ దిలీప్ సుంకరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు.

ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో చందూసాయి ఎంతో ఎమోషనల్ అయ్యాడు. తనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయని.. తన కుటుంబంపై కూడా ఆరోపణలు చేశారని బాధపడ్డాడు. తనపై పెట్టిన కేసుల్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని.. అఘాయిత్యం చేయాల్సిన అవసరం తనకేంటి అని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో తన కుటుంబాన్ని కూడా కలిపి  తప్పుడు వార్తలు రాశారని ఆవేదన చెందాడు. తన కుటుంబం కోట్లు కట్నం అడిగిందని విమర్శలు చేశారని.. తనపై చేసిన ఆరోపణలు, విమర్శలను నిరూపిస్తే.. ఉరిశిక్షకైనా సిద్ధమని అన్నాడు. అసలు ఉరి వాళ్లు వేయడం కాదు.. తానే ఉరేసుకుని చచ్చిపోతానంటూ కామెంట్స్ చేశాడు. మరి చందూ సాయి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.