iDreamPost
android-app
ios-app

రీరిలీజ్ బుకింగ్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ఇంద్ర మూవీ

  • Published Aug 18, 2024 | 1:18 PM Updated Updated Aug 18, 2024 | 1:18 PM

Indra Movie Rerelease Update: నార్మల్ థియేట్రికల్ రిలీజెస్ మీద ఉండే బజ్ ఎప్పుడు అలానే ఉంటుంది . కానీ ఈ మధ్య అందరి ఫోకస్ రీరిలీజ్ ల వైపు కూడా మళ్లింది. పైగా ఈ రీరిలీజ్ సినిమాలు కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అవుతున్న సినిమా 'ఇంద్ర'.

Indra Movie Rerelease Update: నార్మల్ థియేట్రికల్ రిలీజెస్ మీద ఉండే బజ్ ఎప్పుడు అలానే ఉంటుంది . కానీ ఈ మధ్య అందరి ఫోకస్ రీరిలీజ్ ల వైపు కూడా మళ్లింది. పైగా ఈ రీరిలీజ్ సినిమాలు కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అవుతున్న సినిమా 'ఇంద్ర'.

  • Published Aug 18, 2024 | 1:18 PMUpdated Aug 18, 2024 | 1:18 PM
రీరిలీజ్ బుకింగ్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ఇంద్ర మూవీ

రీరిలీజ్ సినిమాలు థియేటర్ లో దుమ్ము దులుపుతున్నాయి. రీసెంట్ గా రీరిలీజ్ లలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా మురారి నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమాకు సంబంధించిన రీల్స్, వీడియోస్ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత రీరిలీజ్ కు రెడీ గా ఉన్న మూవీ ఇంద్ర. చిరంజీవి బర్త్ డే సంధర్బంగా ఆగస్ట్ 22న ఇంద్ర మూవీ రీరిలీజ్ కు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఈ వారం థియేటర్ లో ఆల్రెడీ నాలుగు కొత్త సినిమాలు ఉన్నాయి కాబట్టి.. మొదట ఇంద్ర మూవీకి స్క్రీన్స్ దొరకడం కష్టమే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఎలాంటి అనుమానాలు లేకుండా.. చక చకా రీరిలీజ్ కు ఏర్పాట్లు చేసేస్తున్నారు . ఆల్రెడీ టికెట్స్ ను కూడా బుక్ మై షో లో అందుబాటులో ఉంచారు.

బుకింగ్స్ స్టార్ట్ చేసిన 24 గంటలలోపు 12 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి..కేవలం ఒక్క హైదరాబాద్ నుంచే 40 లక్షల దాకా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆల్రెడీ రీరిలీజ్ ల కలెక్షన్స్ లో మురారి ట్రెండ్ సెట్ చేసింది. మరి చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఇంద్ర’ మూవీ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇంద్ర సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఇరవై ఏళ్ళు గడిచిపోయింది . ఇక ఇప్పుడు ఇన్నేళ్లకు.. అలాంటి ఒక సూపర్ హిట్ సినిమా రీరిలీజ్ అంటే దాదాపు వింటేజ్ చిరు ఫ్యాన్స్ అంతా మరొక్కసారి బిగ్ స్క్రీన్ పై చూడాలనే ఆశతోనే ఉంటారు. కాబట్టి కచ్చితంగా ఈ మూవీ.. రీరిలీజ్ లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పి తీరాలి.

బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ కు అప్పట్లో విపరీతమైన ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఇంకాస్త డిమాండ్ ఎక్కువే ఉంటుంది. పైగా ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు.. అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి.. కచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులకు మంచి బ్రేక్ ఇస్తుంది. ఇక మరో వైవు చిరు విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరు బర్త్ డే సంధర్బంగా విశ్వంభర నుంచి ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో వేచి చూడాలి. మరి ఇంద్ర మూవీ రీరిలీజ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.