iDreamPost
android-app
ios-app

పెదరాయుడు మూవీలో బ్రహ్మానందం భార్య.. ఆ జబర్దస్త్ నటి తల్లి అని తెలుసా..?

  • Published Jul 30, 2024 | 4:12 PM Updated Updated Aug 08, 2024 | 6:32 PM

80-90ల్లో దర్శకుల్లో ఒకరు రవిరాజా పిని శెట్టి. ఆయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ పెదరాయడు. ఇందులో బ్రహ్మానందం భార్యగా నటించిన అమ్మాయి గుర్తుందా.. ఆమె ఆ జబర్థస్త్ నటి తల్లి అని తెలుసా..?

80-90ల్లో దర్శకుల్లో ఒకరు రవిరాజా పిని శెట్టి. ఆయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ పెదరాయడు. ఇందులో బ్రహ్మానందం భార్యగా నటించిన అమ్మాయి గుర్తుందా.. ఆమె ఆ జబర్థస్త్ నటి తల్లి అని తెలుసా..?

  • Published Jul 30, 2024 | 4:12 PMUpdated Aug 08, 2024 | 6:32 PM
పెదరాయుడు మూవీలో బ్రహ్మానందం భార్య.. ఆ జబర్దస్త్ నటి తల్లి అని తెలుసా..?

సినిమాల్లో నటించాలి, ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలిగిపోవాలి అని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే.. ఆశ అందరికీ ఉన్నా.. అవకాశాలు మాత్రం అందరికీ సమానంగా రావు. అలా.. ఛాన్స్ లు రాక, ఒకటి, రెండు సినిమాల్లో మెరిసి కనుమరుగైపోయిన నటీనటులు చాలా మంది ఉంటారు. అలాంటి ఓ నటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోహన్ బాబు- రవిరాజా పినిశెట్టి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పెదరాయుడు. 1995లో వచ్చిన ఈ మూవీ కలెక్షన్లను కొల్లగొట్టడమే కాదు, అప్పట్లో ఇండస్ట్రీ హిట్. అయితే.., ఈ మూవీలోని కామెడీ ట్రాక్ మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. బాబు మోహన్ బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు ఈనాటికీ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించే రేంజ్ లో ఉంటాయి. ఆ మొత్తం ట్రాక్ లో తళుక్కుమని మెరిసిన ఓ నటి తరువాత కాలంలో మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించలేదు.

పెదరాయుడు సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్ తండ్రీకొడుకులు. ఇందులో బాబు మోహన్ స్త్రీ లోలుడు. బ్రహ్మానందానికి తల్లి ఎవరో చెప్పకుండా పెంచుతుంటాడు. ఎన్ని సంబంధాలు చూసినా..తండ్రి వల్ల చెడిపోతుంటాయి. చివరకు తండ్రికి చెప్పకుండా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయిని ఇంటికి తీసుకువస్తాడు. అక్కడ ఫన్ ట్రాక్ నడుస్తుంది. తండ్రిని బ్రహ్మానందం తిడుతుంటే.. ఎంత కాదన్నా నీకు తండ్రి, నాకు మామ గారు అంటూ ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..? జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లి. ఆ సీన్ లో ఆమెకి పెద్దగా డైలాగ్స్ ఉండవు. దీంతో.. సినిమా అంత పెద్ద హిట్ అయినా యాక్టర్ గా మాత్రం ఆమె అంతగా రిజిస్టర్ కాలేదు. ఇక తరువాత కాలంలో ఆమె ప్రేమ వివాహం చేసుకోవడం, తరువాత 10 ఏళ్ళ పాటు ఇండస్ట్రీగా దూరంగా ఉండిపోవడంతో తన ఆశలను అందుకోలేకపోయింది.

 

Jabardasth, Brahmanandam, Ravi Raja Pinisetty, Pedarayudu 02

సత్య శ్రీ నటిగా ఇప్పుడు బాగా లైమ్ లైట్ లోకి రావడంతో ఇప్పుడు ఆమె తల్లి సినీ ప్రస్థానం మరోసారి వార్తల్లో నిలిచింది. నిజానికి సత్య కూడా అంత ఈజీగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు. ముందుగా జబర్థస్త్‌లో చమ్మక్ చంద్ర టీంలో వర్క్ చేసింది. కొన్ని రోజులకు మరో కామెడీ షోలో కనిపించింది. కానీ మళ్లీ జబర్థస్త్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి కొనసాగుతుంది. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీంలో ఫన్ క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా మంచి రోల్స్ దక్కించుకుంటుంది.ఇలా తల్లి నుండి నటనను వారసత్వంగా తీసుకుని వచ్చింది. సత్య శ్రీ తల్లి కూడా పెదరాయుడు తరువాత ఆర్య 2, నరేష్ యముడికి మొగుడు, ఇష్క్ వంటి చిత్రాల్లో నటించింది. సత్య ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక.. ఆమె నటన మానేసింది. ఏదేమైనా.. అమ్మని ఆదర్శంగా తీసుకొని.. ఇండస్ట్రీలోకి వచ్చి, మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్యశ్రీ.. రానున్న కాలంలో మంచి అవకాశాలను దక్కించుకోవాలని కోరుకుందాం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş