iDreamPost
android-app
ios-app

అమెరికాలో ప్రమాదం.. నవీన్ పోలిశెట్టికి గాయాలు!

  • Published Mar 28, 2024 | 9:44 AM Updated Updated Mar 28, 2024 | 11:29 AM

Naveen Polishetty Accident: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలీశెట్టికి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతను అమెరికాలో బైక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది అంటున్నారు. ఈ ప్రమాదంలో నవీన్ కు గాయాలు అయ్యాయి.

Naveen Polishetty Accident: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలీశెట్టికి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతను అమెరికాలో బైక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది అంటున్నారు. ఈ ప్రమాదంలో నవీన్ కు గాయాలు అయ్యాయి.

  • Published Mar 28, 2024 | 9:44 AMUpdated Mar 28, 2024 | 11:29 AM
అమెరికాలో ప్రమాదం.. నవీన్ పోలిశెట్టికి గాయాలు!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అయితే అమెరికాలో నవీన్ కి ప్రమాదం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. నవీన్ పోలిశెట్టి చేతికి ఫ్యాక్చర్ అయ్యిందని చెప్తున్నారు. అతనికి దాదాపు రెండు నెలలు వరకు విశ్రాంతి అవసరం అవుతుందని వైద్యులు సూచించారంట. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అతనికి గాయం అయ్యిందని మాత్రమే చెప్తున్నారు. నవీన్ పోలిశెట్టి అమెరికాలో బైక్ పై వెళ్తుండగా.. జారిపడి ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బైక్ పైనుంచి పడిన తర్వాత అతని చేతికి ఫ్యాక్చర్ అయ్యిందని చెప్తున్నారు. ఈ ఘటన జరిగి రెండ్రోజులు అవుతోంది అంటున్నారు.

నవీన్ కు జరిగిన ఈ ప్రమాదం గురించి ఇండస్ట్రీలో కూడా ఎవరికీ తెలియదు. అతనే స్వయంగా తన టీమ్ కి మెసేజ్ పెట్టిన తర్వాత ఈ విషయం తెలిసింది. చిన్న దెబ్బలు అంటున్నారు కానీ.. రెండు నెలల రెస్ట్ అవసరం అన్నారు అంటే కచ్చితంగా గాయం బలంగానే తగిలి ఉండచ్చు. ఈ ప్రమాదం వల్ల కనీసం 3 నెలలపాటు నవీన్ పోలిశెట్టి సెట్స్ మీదకు రావడం కష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నవీన్ తన తర్వాతి సినిమా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలో చేయాల్సి ఉంది. కథ కూడా సిద్ధం చేసుకున్నారు అని టాక్ వచ్చింది. కానీ, కథ నచ్చినా కూడా నవీన్ కి డైరెక్టర్ నచ్చలేదు అని వార్తలు వచ్చాయి. అందుకే వేరే కథ, వేరే డైరెక్టర్ ని వెతుకుతున్నారు అంటున్నారు. సితార సంస్థలో మాత్రమే కాకుండా.. షైన్ స్క్రీన్స్ లో కూడా నవీన్ ఒక సినిమా చేయాల్సి ఉంది.

జాతి రత్నాలు, మిస్టర్ శెట్టి మిస్ పోలిశెట్టి తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చేందుకు నవీన్ రెడీ అవుతున్నాడు అంటున్నారు. కానీ, ఇలా ప్రమాదం జరగడంతో అతని కెరీర్ లో కాస్త బ్రేక్ తీసుకోక తప్పడం లేదు. ఈ యంగ్ హీరోకి ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా లవర్స్ నుంచి నవీన్ పోలిశెట్టికి అభిమానులు ఉన్నారు. జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పటికీ ఆ మూవీ డైలాగ్స్ ని ఆడియన్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. భాష, యాస, వేషధారణ, బాడీ ల్యాంగ్వేజ్ ఇలా అన్నీ తాను చేసే పాత్రకు తగినట్లుగా మార్చుకుంటాడు. నవీన్ హిందీ మాట్లాడితే అతను కచ్చితంగా నార్త్ కుర్రాడు అనుకుంటారు. మరోవైపు నవీన్ కి రైటింగ్ మీద కూడా పట్టు ఉంది. అందుకే భిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ నవీన్ తనదైనశైలిలో దూసుకుపోతున్నాడు. మరి.. నవీన్ కి ప్రమాదం జరిగింది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio