iDreamPost
android-app
ios-app

నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్.. వీళ్ళిద్దరూ కలిస్తే బీభత్సమే!

  • Published Jan 16, 2024 | 2:09 PM Updated Updated Jan 16, 2024 | 3:50 PM

నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్.. ఈ ఊహ ఎంతో బాగుంది కదా. అయితే వీళ్ళిద్దరూ అనుకుని దిగారో లేక విడివిడిగా కలిసి ఒకే ప్రాజెక్ట్ ని చేస్తున్నారో తెలియదు కానీ ప్రభాస్ కల్కితో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లింక్ అయి ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఆ కథనం మొత్తం చదివేయండి. 

నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్.. ఈ ఊహ ఎంతో బాగుంది కదా. అయితే వీళ్ళిద్దరూ అనుకుని దిగారో లేక విడివిడిగా కలిసి ఒకే ప్రాజెక్ట్ ని చేస్తున్నారో తెలియదు కానీ ప్రభాస్ కల్కితో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లింక్ అయి ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఆ కథనం మొత్తం చదివేయండి. 

నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్.. వీళ్ళిద్దరూ కలిస్తే బీభత్సమే!

ఉన్నట్టుండి తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. మన తెలుగు హీరోలు, దర్శకులు కంటెంట్ తో ర్యాంప్ ఆడిస్తున్నారు. ఆ బాక్సాఫీస్ కి గ్యాప్ ఇవ్వడం లేదు. సినిమా చూసే ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. ఎలాంటి సినిమాలు చూడాలో అన్న అవగాహన పుష్కలంగా ఉంది. అందుకే కంటెంట్ ఉన్న సినిమాలని ఏ మాత్రం హిట్ చేయకుండా వదలడం లేదు. యంగ్ డైరెక్టర్స్ కూడా సినిమా పట్ల.. మన కల్చర్ పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నారు. అలాంటి వారిలో మన నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ ముందు వరుసలో ఉంటారు. నాలుగు మాస్ సాంగ్స్ పెట్టేసి.. ఒక మసాలా సాంగ్ ఇరికించేసి.. యాక్షన్ సీక్వెన్సులు, హీరోకి, హీరోయిన్ కి మధ్య రొమాంటిక్ సీన్స్ పెట్టేసి కమర్షియల్ సినిమా అనిపించేసుకుంటే కాసులు వచ్చేస్తాయి అన్న సూత్రానికి విరుద్ధం.. ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్స్.

ఆ విషయం నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మల మూవీ లైబ్రరీ చూస్తేనే అర్థమవుతుంది. నాగ్ అశ్విన్ చేసింది మూడు సినిమాలే. వాటిలో ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాలు చూస్తే నాగ్ అశ్విన్ అభిరుచి ఏపాటిదో తెలుస్తుంది. ఇక ప్రశాంత్ వర్మ చేసింది మొన్నొచ్చిన హనుమాన్ తో నాలుగు సినిమాలు. పట్టుమని పది సినిమాల అనుభవం కూడా లేదు కానీ 100 సినిమాల అనుభవం ఉన్న దర్శకుల్లా సినిమాలతో మాట్లాడుతున్నారు. సరే వీళ్ళిద్దరూ తోపు దర్శకులని ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. ఇక కొత్తగా చెప్పడానికి ఏముంటుందిలెండి. అయితే వీరిద్దరూ వెళ్లే దారులు వేరైనా.. ఫైనల్ గా చేరే గమ్యం ఒకటే. అర్థం కాలేదు కదూ. అర్ధం అవ్వాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి. 

హనుమాన్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అంటే హనుమాన్ తర్వాత సూపర్ హీరో కాన్సెప్ట్ తో వరుసగా సినిమాలు వస్తాయన్నమాట. మరి ఫైనల్ పార్ట్ ఎలా ఉండబోతుంది? ఎలా ఎండ్ అవ్వబోతుంది? ఆ ఫైనల్ పార్ట్ లో వచ్చే సూపర్ హీరో ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానమే ప్రభాస్ కల్కి. అవును నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ప్రభాస్ కల్కి సినిమాలో ఉన్న పాత్రే.. ప్రశాంత్ వర్మ ఫైనల్ పార్ట్ లో సూపర్ హీరో. మన పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు.. వీరిని సప్త చిరంజీవులు అంటారు. ఇప్పటికీ వీరు ఈ భూమ్మీద సజీవంగానే ఉన్నారని, ఎప్పటికీ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. 

కల్కి చేసే యుద్ధంలో సప్త చిరంజీవులు: 

కల్కి గురించి తెలిసే ఉంటుంది. మహావిష్ణువు అవతారంలో ఆఖరి అవతారం. కలియుగంలో కలి ప్రభావం వల్ల అధర్మం ఎక్కువైతే కల్కి రూపంలో విష్ణువు వచ్చి అంతం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కికి, కలి రాక్షసుడికి మధ్య జరిగే భీకర యుద్ధంలో ఈ సప్త చిరంజీవులు మద్దతుగా నిలుస్తారు. ఆ ఫైనల్ బ్యాటిల్ ని డైరెక్ట్ గా చూపిస్తే థ్రిల్ ఏముంటుంది.. అందుకే ప్రశాంత్ వర్మ ఇలా ఒక్కొక్క సూపర్ హీరోలని రివీల్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగా వచ్చిందే హనుమాన్ మూవీ. ముందుగా విభీషణుడ్ని పరిచయం చేసి.. ఆ తర్వాత అశ్వత్థామ, హనుమంతుడి సహా మిగతా చిరంజీవులని పరిచయం చేస్తాడు. చివరాఖరున హనుమంతుడిని పరిచయం చేస్తాడు.

జెండాపై కపిరాజులా ఫైనల్ బ్యాటిల్ లో అండగా నిలుస్తాడు. మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడి రథం మీద హనుమంతుల వారు అండగా ఉంటారు. ఆయన ఉన్నంత సేపు రథం ఒరగదు. యుద్ధం ముగిసిన అనంతరం హనుమంతుడు వెళ్ళిపోయాక రథం కింద పడిపోతుంది. జెండాపై కపిరాజు ఉంటే ఎంత పెద్ద శత్రువునైనా జయించవచ్చు. ఈ పాయింట్ మీదే హనుమాన్ క్యారెక్టర్ ని ప్రశాంత్ వర్మ హైలైట్ చేస్తూ సినిమా చేశాడు. ఈ హనుమాన్.. లాస్ట్ లో కల్కితో కలిసి యుద్ధంలో పాల్గొంటాడు. ఈ హనుమాన్ పాత్ర.. మహాభారత యుద్ధంలోనూ, రామ, రావణ యుద్ధంలోనూ ఉంది. 

ప్రభాస్ కల్కికి, హనుమాన్ కి లింక్:

ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కల్కికి సపోర్ట్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ పేరు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ కూడా సప్త చిరంజీవుల్లో ఒకరు. ప్రశాంత్ వర్మ తీయబోయే సినిమాటిక్ యూనివర్స్ లో ఫైనల్ పార్ట్ కూడా కల్కి బేస్ మీదే ఉంటుంది. కాకపోతే ప్రభాస్ కల్కి సినిమా ప్రశాంత్ వర్మ తీయబోయే కల్కి కంటే ముందుగానే రిలీజ్ అవుతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కల్కి ఫైనల్ పార్ట్ మాత్రం ఆలస్యంగా వస్తుంది. ఈ గ్యాప్ లో సూపర్ పవర్స్ కలిగిన దేవుళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తాడు. ఇందులో భాగమే అధీర, జై హనుమాన్ సినిమాలు. అధీర టైటిల్ గమనిస్తే వజ్రాయుధం కనిపిస్తుంది. ఇది ఇంద్రుడి ఆయుధం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర కూడా ఒకటి.

ఇంద్రుడికి, హనుమాన్ కి లింక్ ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో కూడా చూపించాడు. హనుమంతుడు బాల్యంలో పండు అనుకుని సూర్యుడ్ని మింగేస్తాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసరడంతో హనుమంతుడికి గాయం అవుతుంది. ఆ తర్వాత వాయుదేవుడు ఆగ్రహించగా.. బ్రహ్మ దేవుడు వచ్చి చిరంజీవిగా వర్ధిల్లమని హనుమంతుడికి వరమిస్తాడు. ఇలా హనుమంతుడితో లింక్ అయి ఉన్న ప్రతీ పవర్ ఫుల్ క్యారెక్టర్ ని ప్రశాంత్ వర్మ రివీల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. హనుమాన్ తర్వాత జై హనుమాన్ ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పాడు. అలానే అధీర కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతుంది. ఇలా హిందూ దేవుళ్ళని ప్రశాంత్ వర్మ సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు.   

మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కల్కి ఎవరు?

ఇదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. ప్రభాస్ ఆల్రెడీ నాగ్ అశ్విన్ సినిమాలో కల్కిగా నటిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ప్రశాంత్ వర్మ సినిమాలో కల్కిగా నటించే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో స్టార్ హీరోలని తీసుకోవాలన్న ఆలోచన ఉంటే మాత్రం తెలుగు సినిమాకి తిరుగుండదు. తేజ సజ్జా వంటి చిన్న హీరోతోనే ఇంత అద్భుతం సృష్టించాడంటే స్టార్ హీరోలతో చేస్తే ప్రపంచం మొత్తాన్ని విస్మయానికి గురి చేస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

Nag ashwin kalki and prashanth varma hanuman inter links

ఒకవేళ ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ కలిస్తే:

ఈ ఊహ అనుకుంటేనే ఎంత బాగుందో కథ. యాదృచ్చికమో లేక అనుకుని చేస్తున్నారో తెలియదు కానీ ఇద్దరూ ఒకే సోల్ ని పట్టుకున్నారు. కల్కి అనే క్యారెక్టర్ ని.. నాగ్ అశ్విన్ కాస్త ముందు తీస్తుంటే.. ప్రశాంత్ వర్మ మాత్రం ఓ 10, 12 సినిమాల అనంతరం పరిచయం చేయబోతున్నాడు. ఇద్దరూ ఇండియన్ సినిమా సత్తా చాటుతున్న దర్శకులే. అలాంటి ఈ ఇద్దరూ కలిసి పని చేస్తే ప్రపంచ బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయం. ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పని చేయనవసరం లేదు. ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాటిక్ యూనివర్స్ లో కలిసి సినిమాలు చేసినా చాలు.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లా.. ఈ ఇద్దరినీ కలిపే సినిమాటిక్ యూనివర్స్ తెలుగులో వస్తే కనుక రికార్డులు గల్లంతే. అంటే ఒకే నిర్మాణ సంస్థలో సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేయాలి. దానికి ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ వంటి యువ దర్శకులు రావాలి. చందూ మొండేటి అటు కార్తికేయ ఫ్రాంచైజీతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఇలా వీరంతా హిందూ దేవుళ్లను ప్రపంచానికి సూపర్ హీరోలుగా పరిచయం చేస్తున్నారు. వీరి ప్రయాణ మార్గాలు వేరైనా.. గమ్యం మాత్రం ఒకటే. మన మూలాల్ని ప్రపంచానికి చాటి చెప్పడం. ఇప్పటికే కల్కితో ఈ ఇద్దరిదీ ఒకే గమ్యం అని నిరూపించారు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి ఒకే గమ్యం కోసం పని చేస్తే.. బీభత్సమే కాదంటారా?

Nag ashwin kalki and prashanth varma hanuman inter links