iDreamPost
android-app
ios-app

ఓపెన్‌ అయిన ప్రశాంత్‌ నీల్‌.. తాను మంచి భర్త కాదంటూ..

ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కిన సలార్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదటి రోజు ఏకంగా 178 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.

ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కిన సలార్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదటి రోజు ఏకంగా 178 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.

ఓపెన్‌ అయిన ప్రశాంత్‌ నీల్‌.. తాను మంచి భర్త కాదంటూ..

ప్రశాంత్‌ నీల్‌ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. తీసింది నాలుగు సినిమాలే అయినా.. 100 సినిమాలకు సరిపడా క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్యాన్‌ ఇండియా చిత్రాల రారాజుగా మారిపోయారు. ఆయన తీసిన కేజీఎఫ్‌ 2 ప్రపంచ వ్యాప్తంగా 1200లకు పైగా కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ప్రభాస్‌తో ఆయన తీసిన తాజా చిత్రం కూడా కేజీఎఫ్‌ రికార్డులను ఇట్టే బ్రేక్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. సలార్‌ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 178.7 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. విడుదలైన ప్రతీ భాషల్లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌ కారణమైన, అద్భుతమైన సినిమా అందించిన ప్రశాంత్‌ నీల్‌పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దాదాపు 5 ఏళ్ల నిరీక్షణకు సలార్‌ రూపంలో ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సలార్‌ సాధించిన విజయంతో ప్రశాంత్‌ నీల్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత సలార్‌ 2 పై ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది.

ఎప్పుడూ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే ఆయన కుటుంబం కోసం సమయం కేటాయించలేకపోతున్నారట. పిల్లలను సైతం సరిగా చూసుకోలేకపోతున్నారట. తాను మంచి భర్తను కాదని ప్రశాంత్‌ నీల్‌ అంటున్నారు. తాజాగా ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ… ‘‘ నేను ఓ చెడ్డ కొడుకును, చెడ్డ తండ్రిని, చెడ్డ భర్తను, ఓ చెత్త స్నేహితుడ్ని. నేను సినిమా కోసం అన్నిటిని త్యాగం చేశాను. కానీ, ఫ్రెండ్షిప్‌కు వాల్యూ ఇచ్చే వాళ్లను చూశాను. విజయ్‌ కిరగందూరు, అతడి స్నేహితుల్ని చూసినపుడు సంతోషం వేస్తుంది. నేను కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించను. నేను నా పిల్లల్ని మూడు నెలల కోసారి మాత్రమే చూస్తాను.

అప్పుడు వాళ్ల దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళతాను. నేను ఈ రియాలిటీని ఒప్పుకుంటాను. నేను తీసే సినిమా అద్భుతంగా రావాలనేది నా లక్ష్యం. ఓ సినిమా అయిపోయిన తర్వాత బ్రేక్‌ తీసుకోవటం నా చేతుల్లోనే ఉంటుంది’’ అని అన్నారు. ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో లేకపోయినా.. ఆయన భార్య లిఖితా రెడ్డే పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఈ విషయంలో తాను అదృష్టవంతుడ్ని అని ప్రశాంత్‌ నీల్‌ అన్నారు. కాగా, సలార్‌ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ నటించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహ, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. మరి, తాను మంచి భర్తను కాదంటున్న ప్రశాంత్‌ నీల్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişmarsbahis