iDreamPost
android-app
ios-app

యూట్యూబ్ యాంకర్ ని పెళ్లి చేసుకోబోతున్న హైపర్ ఆది..?

  • Author ajaykrishna Updated - 11:17 AM, Tue - 1 August 23
  • Author ajaykrishna Updated - 11:17 AM, Tue - 1 August 23
యూట్యూబ్ యాంకర్ ని పెళ్లి చేసుకోబోతున్న హైపర్ ఆది..?

బుల్లితెరపై నాన్ స్టాప్ పంచులు ప్రాసలతో కామెడీ పండించే కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఆది.. మెల్లగా టీమ్ లో సభ్యుడు నుండి టీమ్ లీడర్ గా ఎదిగాడు. అక్కడినుండి సూపర్ క్రేజ్ సంపాదించుకుని.. టీవీ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆది లైఫ్ గురించి తెలిసిందే. ఓవైపు టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బుల్లితెర కమెడియన్ అయినప్పటికీ.. పూర్తి స్థాయి సినిమా కమెడియన్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే.. మూడు పదులు వయసు దాటినా ఆది బ్యాచిలర్ గానే ఉన్నాడు.

కొంతకాలంగా హైపర్ ఆది పెళ్లి ఎప్పుడు? ప్రేమలో ఉన్నాడా.. గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పబోతున్నాడు? లాంటి సందేహాలు ఎక్కడికి వెళ్లినా ఎదురవుతూ ఉన్నాయి. దీంతో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదోకటి చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. హైపర్ ఆది త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడట. ఎందుకంటే.. ప్రస్తుతం ఆది ప్రేమలో ఉన్నాడట. ఏంటి.. ఆది ప్రేమలో ఉన్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆది లవ్ చేస్తుంది ఎవరినో కాదు.. ఓ యాంకర్ ని అంట. ఆమె టీవీ యాంకర్ కాదు.. యూట్యూబ్ యాంకర్ అని తెలుస్తోంది.

ఆ స్టోరీలోకి వెళ్తే.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆ యాంకర్ ని కలిసిన ఆది.. తొలి చూపులోనే ఇష్టపడ్డాడని.. అలా పరిచయం పెంచుకొని మెల్లగా ప్రేమలో పడ్డాడని టీవీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇంతకీ ఆ యూట్యూబ్ యాంకర్ ఎవరు? అనేది మాత్రం బయటికి క్లారిటీ రాలేదు. దీంతో హైపర్ ఆది ఫ్యాన్స్ అందరు.. గతంలో ఆది.. లేడీ యాంకర్స్ తో చేసిన ఇంటర్వ్యూలన్నీ తిరగేస్తున్నారు. అందులో పెళ్లికాని వాళ్లు ఎవరైనా ఉన్నారేమో.. ఆ ఇంటర్వ్యూలో ఆది ఏమైనా కనెక్ట్ అవ్వడం కనిపిస్తుందేమో అని వెతుకుతున్నారు. మరోవైపు ఆదినే ఏమైనా ఉంటే అనౌన్స్ చేస్తాడులే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి హైపర్ ఆది కంటే ముందు సుడిగాలి సుధీర్ కూడా బ్యాచిలర్ గా ఉన్నాడు. ఇద్దరు ప్రెజెంట్ కెరీర్ లో బిజీ అయిపోయారు. ఇప్పట్లో పెళ్లి వార్త చెబుతారా లేదా చూడాలి! మరి హైపర్ ఆది గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom