iDreamPost
android-app
ios-app

Nani: ఆ ధైర్యంతో నాని భారీ రిస్క్! వర్కౌట్ అయ్యేనా?

  • Published Jul 04, 2024 | 3:03 PM Updated Updated Jul 04, 2024 | 3:03 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు నాని. ఇక ఈ మూవీ తర్వాత నాని ఓ భారీ రిస్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ అతడు చేసే రిస్క్ ఏంటి? ఆ వివరాలు..

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు నాని. ఇక ఈ మూవీ తర్వాత నాని ఓ భారీ రిస్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ అతడు చేసే రిస్క్ ఏంటి? ఆ వివరాలు..

  • Published Jul 04, 2024 | 3:03 PMUpdated Jul 04, 2024 | 3:03 PM
Nani: ఆ ధైర్యంతో నాని భారీ రిస్క్! వర్కౌట్ అయ్యేనా?

న్యాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ లో డీసెంట్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. ప్రేక్షకులను తన సినిమాలతో అలరిస్తున్నాడు. అయితే మధ్య మధ్యలో విభిన్నమైన మూవీలు కూడా చేస్తూ.. నటుడిగా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత నాని ఓ భారీ రిస్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ నాని చేసే రిస్క్ ఏంటి? తర్వాత చేయబోయే చిత్రానికి డైరెక్టర్ ఎవరు? ఆ వివరాలు చూద్దాం పదండి.

ఇండస్ట్రీలో అప్పుడప్పుడు భారీ రిస్కులు చేయాల్సి ఉంటుంది. అలా చేసి విజయం సాధించినప్పుడే ఆ హీరో రేంజ్ పెరిగిపోతుంది. అలా కాదని రిస్క్ చేయడానికి భయపడితే.. ఉన్నచోటే ఉండిపోతాం. తాను మాత్రం అలా ఉండాలనుకోవట్లేదు అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ హీరో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ‘సరిపోదా శనివారం’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ మూవీ తర్వాత తనకు ‘దసరా’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో ఓ చిత్రం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

Nani Taking Risk

నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో త్వరలో రాబోయే చిత్రానికి దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూసే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే? ప్రస్తుతం ఉన్న నాని మార్కెట్ కు ఈ బడ్జెట్ చాలా పెద్దది. థియేటర్, ఓటీటీ కలిపినా ఈ బడ్జెట్ ను వసూల్ చేయడం కష్టం. అయినప్పటికీ నాని రిస్క్ చేయడానికి కారణం దసరా మూవీ ఇచ్చిన ధైర్యమే. వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా మూవీ ఊహించిన దానికన్నా ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. వంద కోట్ల వసూళ్లు సాధించడంతో.. ఈ సినిమా కూడా ఆ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందని నానితో పాటుగా మూవీ మేకర్స్ నమ్ముతున్నారట. అందుకే నిర్మాత సైతం భారీ బడ్జెట్ పెట్టడానికి సిద్ధపడ్డారని టాక్.

అయితే ఇంత బడ్జెట్ తో నాని రిస్క్ చేస్తున్నాడు సరే.. వర్కౌట్ అయ్యేనా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు సినీ పండితులు. ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరుతుందని, అందుకు తగ్గట్లుగా సెట్ ను కూడా వేస్తున్నారని తెలుస్తోంది. ఈ పనులను దర్శకుడు శ్రీకాంత్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడట. అన్నీ కుదిరితే జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు డైరెక్టర్. మరి భారీ బడ్జెట్ తో నాని రిస్క్ చేస్తున్నాడా? అది వర్కౌట్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş