iDreamPost
android-app
ios-app

అఫీషియల్: బిగ్ బాస్ 8 అప్ డేట్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున

  • Published Jul 21, 2024 | 1:59 PM Updated Updated Jul 21, 2024 | 1:59 PM

Nagarjuna Update On Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. హోస్ట్ నాగార్జున ఆ అప్ డేట్ ని ఇచ్చారు. మరి.. ఆ అప్ డేట్ ఏంటో మీరే చూసేయండి.

Nagarjuna Update On Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. హోస్ట్ నాగార్జున ఆ అప్ డేట్ ని ఇచ్చారు. మరి.. ఆ అప్ డేట్ ఏంటో మీరే చూసేయండి.

  • Published Jul 21, 2024 | 1:59 PMUpdated Jul 21, 2024 | 1:59 PM
అఫీషియల్: బిగ్ బాస్ 8 అప్ డేట్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున

బిగ్గెస్ట్ రియాలిటీ షో అని ఏదైనా ఉంది అంటే ముందుగు అంతా బిగ్ బాస్ పేరే చెప్తారు. విదేశాల నుంది అరువు తెచ్చుకున్న ఈ కాన్సెప్ట్ ఇండియాలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్స్, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ కి కూడా రెడీ అయిపోతోంది. ఆగస్టు మొదటి వారం లేదా.. నాగులో వారంలో ఈ షో స్టార్ట్ అవుతుంది అంటూ చాలానే వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ ఇప్పుడు కింగ్ నాగార్జున ఒక క్రేజీ అప్ డేట్ అయితే ఇచ్చేశాడు. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్ అప్ డేట్ ని పోస్ట్ చేశారు.

కింగ్ నాగార్జున తనదైనశైలిలో సీజన్ 7ని హోస్ట్ గా మోస్ట్ సస్కెస్ ఫుల్ సీజన్ గా మార్చారు. ఇప్పుడు మరింత జోష్ తో 8వ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అందుకు సంబంధించిన అప్ డేట్ కూడా రానే వచ్చింది. తాజాగా నాగార్జున ఈ సీజన్ 8 లోగోని రివీల్ చేశారు. ఒక చిన్న గ్లింప్స్ ఒకటి షేర్ చేశారు. అందులో బిగ్ బాస్ సీజన్ 8 లోగో ఉంది. ఈసారి లోగో చాలా కొత్తగా ఉంది అనే చెప్పాలి. ప్రతి సీజన్ కి ఒక కొత్త కాన్సెప్ట్ లో ఈ లోగో తయారు చేస్తారు. అలాగే ఈ సీజన్ కి కూడా అదే తరహా కొత్తదనాన్ని చూపించారు. గంతంతో పోలిస్తే ఈసారి చాలా కలర్ ఫుల్ గా ఉంది. నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ అనే అర్థం వచ్చేలా ఇన్ఫినిటీ సింబల్ ని చూపించి ఆ తర్వాత దానిని 8గా మార్చారు.

ఈ వీడియో షేర్ చేస్తూ నాగార్జున.. ఒక మంచి క్యాప్షన్ కూడా పెట్టారు. “మేము ఒక బాంగ్ తో ఈ ఎంటర్ టైన్మెంట్ ని మల్లీ తీసుకొచ్చాం. ఎపిక్ సీజన్ 8కి సంబంధించిన లోగోని మీ ముందుకు తీసుకొచ్చాం. మీరంతా అపరిమిత ఫన్, ఎంటర్ టైన్మెంట్ కి రెడీ గా ఉన్నారా?” అంటూ అభిమానులను ప్రశ్నించారు. అలాగే సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అని కమింగ్ సూన్ అంటూ ఆ గ్లింప్స్ లో ఉంది. ఇప్పుడు టాలీవుడ్, బుల్లితెరలో ఈ షో గురించే బజ్ నడుస్తోంది. ఈ లోగో వచ్చిన తర్వాత అవి మరింత పెరిగిపోయాయి.

ఎలా అయితే ఆగస్టు నెలలో షో స్టార్ట్ అవుతుంది అనే వార్తలు వచ్చాయో దానికి తగినట్లుగానే.. ఇప్పుడు లోగోని రిలీజ్ చేశారు. అయితే కచ్చితంగా ఆగస్టు నెలాఖరున ఈ షో ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేణుస్వామి పేరు వినిపిస్తోంది. అలాగే ఇన్ ఫ్లుఎన్సర్స్ కుమారీ ఆంటీ, బర్రెలక్క, సామ్రాట్ పేర్లు చెప్తున్నారు. ఇంక గత సీజన్ రన్నరప్ అమర్ దీప్ భార్య తేజశ్వి గౌడ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. ఈ బిగ్ బాస్ 8 లోగోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom