iDreamPost
android-app
ios-app

Janhvi Kapoor: ‘దేవర’ బ్యూటీపై హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పొగడ్తల వర్షం!

  • Published Jul 29, 2024 | 1:43 PM Updated Updated Jul 29, 2024 | 1:43 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్. గ్లాడియేటర్ లాంటి చిత్రాలకు ఇతడు స్టంట్ మాస్టర్ గా పనిచేశాడు.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్. గ్లాడియేటర్ లాంటి చిత్రాలకు ఇతడు స్టంట్ మాస్టర్ గా పనిచేశాడు.

Janhvi Kapoor: ‘దేవర’ బ్యూటీపై హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పొగడ్తల వర్షం!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తుండగా.. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న RC 16లో కూడా ఛాన్స్ కొట్టేసింది. లేటెస్ట్ గా నాని-శ్రీకాంత్ ఓదెల మూవీలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మపై పొగడ్తల వర్షం కురిపించాడు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్. ఆమె గురించి ఏమన్నాడంటే?

జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉలజ్’.. ఆగస్ట్ 2 విడుదల కాబోతోంది. దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారిన్ సర్విసెస్ నేపథ్యంలో కొనసాగే థ్రిల్లర్ చిత్రంగా రూపొందింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, ప్రత్యేక వీడియోలు ప్రక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. పైగా విడుదలకు ముందే అభిమానుల కోసం ప్రత్యేక ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు. ప్రీమియర్స్ టికెట్స్ ఆన్ లైన్ లో విడుదల చేయగా.. 30 నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైయ్యాయి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్ గా హాలీవుడ్ కు చెందిన నిక్ పావెల్ పనిచేశాడు. అతడు జాన్వీ కపూర్ పై ప్రశంసలు కురిపించాడు.

నిక్ పావెల్ మాట్లాడుతూ..”జాన్వీ కపూర్ చాలా సున్నితమైన వ్యక్తి. ఆమె ఎవరినైనా కొట్టి గాయపర్చే రకం కాదు. కానీ యాక్షన్ సీన్స్ లో మాత్రం నలుగురిని కొట్టాడనికి కూడా వెనకాడని యువతిగా కనిపించి మెప్పించింది. యాక్షన్ సీన్స్ లో అవతలి వారు ఎక్కడ గాయపడతారో అని తెగ భయపడిపోయేది. జాన్వీ లాంటి మంచి మనిషిని నేనెక్కడా చూడలేదు” అంటూ ప్రశంసలు కురిపించాడు ఈ హాలీవుడ్ స్టంట్ మాస్టర్. కాగా.. ఉలజ్ మూవీకి ధాన్షు సారియా దర్శకత్వం వహించగా.. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, జితేంద్ర జోషీ, రాజేంద్ర గుప్తా కీలక పాత్రలు పోషించారు. బర్న్ ఐండెంటిటి, గ్లాడియేటర్, ది లాస్ట్ సమురై లాంటి చిత్రాలకు స్టంట్ డైరెక్టర్ గా పనిచేశాడు నిక్ పావెల్.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap